సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అగ్నిపథ్ రద్దు చేసి ఆర్మీ పరీక్షలు యధాతథంగా నిర్వహించాలని యువకులు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున యువకులు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుని అక్కడ ఉన్న బస్సులపై రాళ్లు రువ్వారు. అద్దాలను ధ్వంసం చేశారు. అలాగే రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించి రాళ్లతో రైలుపై దాడి చేస్తూ నానా హంగామా సృష్టించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article