F2 COLLECTS 2 MILLION IN OVERSEAS
- రెండు మిలియన్ డాలర్ల మార్కు చేరుకున్న సినిమా
అంతేగా.. అంతేగా.. అంటూ ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) సినిమా ఓవర్సీస్ లోనూ తిరుగులేని విధంగా దూసుకుపోతోంది. చక్కని కామెడీ కమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు నీరాజనం పడుతున్నారు. ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ మార్కు చేరుకున్న ఈ సినిమా.. తాజాగా మరో విజయం నమోదు చేసింది. ఈ చిత్రం ఓవర్సీస్ లో రెండు మిలియన్ల డాలర్లు సాధించినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. దేవీప్రసాద్ సంగతం అందించారు.