ఆ బొమ్మ కలెక్షన్లు కుమ్మేస్తోంది

F2 GOT 100 CR GROSS

  • వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఎఫ్2

సంక్రాంతికి అండర్ డాగ్ గా బరిలోకి దిగి.. ప్రేక్షకుల మదిని దోచుకున్న ఎఫ్2 సినిమా.. అంతే స్థాయిలో వసూళ్లూ కొల్లగొడుతోంది. బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ చిత్రాలకు అంతంతమాత్రం కలెక్షన్లు రాగా.. వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా మాత్రం కలెక్షన్లను కుమ్మేస్తోంది. తమ బొమ్మ బ్లాక్ బస్టర్ అయిందని, ఇప్పటివరకు వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని నిర్మాతలు ప్రకటించారు. ప్రస్తుతం మూడో వారంలోకి అడుగుపెట్టిన సినిమా.. విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ ఏడాదిలో టాలీవుడ్‌కు మొట్టమొదటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇదే కావడంతో ఈ చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగిపోయింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

TELUGU CINEMA

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article