100 కోట్ల క్లబ్ లో ఎఫ్ 3

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో F3 సినిమా తెరకెక్కింది. F2 సినిమాకి సీక్వెల్ గా చేసిన ఈ సినిమా మే 27న రిలీజ్ అయింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని హిట్ టాక్ సంపాదించింది. F2 సినిమాలాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులని నవ్విస్తుంది. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ F3 సినిమాకి కనెక్ట్ అయి హిట్ టాక్ ని ఇచ్చి కలెక్షన్లని కూడా ఇచ్చారు.గతంలో వచ్చిన F2 సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరి వెంకటేష్, వరుణ్ లకు మొదటి 100 కోట్ల సినిమా అయింది. తాజాగా F3 సినిమా కూడా 100 కోట్ల క్లబ్ లో చేరింది. సినిమా రిలీజ్ అయిన పది రోజులకి 102 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మరింత కలెక్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఈ వారం విక్రమ్, మేజర్ సినిమాలు రిలీజ్ అయి F3కి ప్రేక్షకులు తగ్గినా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఇంకా వస్తూనే ఉన్నారు. అలాగే ఈ సినిమా మరో నెల రోజుల వరకు కూడా ఓటీటీలో రాదని చెప్పడంతో ఆడియన్స్ పెరిగే అవకాశం ఉంది. లాంగ్ రన్ లో ఇప్పుడున్న సినిమాల మధ్య ఈజీగా మరో 20 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంటున్నారు. దీంతో వెంకటేష్, వరుణ్ బ్యాక్ టు బ్యాక్ కామెడీ సినిమాలతో 100 కోట్ల కలెక్షన్లని సాధించి రికార్డ్ సృష్టించారు. ఇక అనిల్ రావిపూడి అయితే బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు 100 కోట్లు సాధించి మరోసారి తన సత్తా చూపించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article