ఫేస్ బుక్ జియోలో ₹ 43,574 పెట్టుబడి

Facebook Invested 43574 Cr In Jio

భారతదేశంలో పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగదారులను ద్రుష్టిలో పెట్టుకుని ఫేస్ బుక్ కీలక నిర్ణయం తీసుకున్నది. గత కొంతకాలం నుంచి భారత్లోని అట్టడుగు వర్గాలకు సైతం బ్రాడ్ బ్యాండ్ సేవల్ని అందించిన రిలయన్స్ జియో సంస్థలో దాదాపు రూ.43,574 కోట్లను పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని స్వయంగా ఫేస్ బుక్ సీఈవో, ఫౌండర్ జూకర్ బర్గ్ తెలిపారు. తాము జియో సంస్థలో దాదాపు 9.99  శాతం వాటాను కొనుగోలు చేశామని వెల్లడించారు. అంటే, దీని ప్రకారం రిలయన్స్ జియో మొత్తం విలువ ఎంతలేదన్నా 4.4 లక్షల కోట్ల దాకా ఉంటుందని అంచనా వేయవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో భారత్ లో ఇంటర్నెట్  వినియోగదారులు మరింత పెరిగేందుకు అవకాశం ఉండటం వల్ల తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.#FacebookInvestedInRelianceJio,#FacebookInvestedInIndianCompanyDuringLockdown

First FDI In India In Covid-19 Lockdown

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *