తెలంగాణలో మద్యం దరఖాస్తుల వెల్లువతో కాసుల గలగల

fair amount of liquor applications in telangana 

తెలంగాణ సర్కారు కు మద్యం దరఖాస్తుల రూపంలో ఆదాయం వచ్చింది. కరువులో కొట్టుమిట్టాడుతున్న కేసీఆర్ కు మద్యం దరఖాస్తులు కిక్ ఇచ్చాయని చెప్పాలి. బుధవారంతో ముగిసిన మద్యం షాపుల టెండర్లకు భారీ స్పందన వచ్చింది. కాసుల పంట పండింది. ఏకంగా గతంలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే 470 కోట్ల అదనపు ఆదాయం ఒక్క దరఖాస్తు ఫీజు రూపంలోనే వచ్చిందంటే ఎంతగా మద్యం షాపుల లైసెన్సుల కోసం పోటీ పడ్డారో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో మద్యం షాపుల కాలపరిమితి ముగిసిపోయింది. కొత్త మద్యం పాలసీని అమలు చేసి మద్యం షాపులకు టెండర్లు వేశారు. ఇప్పటివరకు 2216 మద్యం షాపులకు ఏకంగా 45వేల దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులతో ప్రభుత్వానికి ఏకంగా 900 కోట్ల ఆదాయం రావడం విశేషం.బుధవారం ఒక్కరోజే ఏకంగా 2216 మద్యం షాపులకు 20వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. గత సంవత్సరం కన్నా అదనంగా 470 కోట్ల ఆదాయం కేవలం దరఖాస్తుల ఫీజు రూ.2లక్షల ద్వారానే రావడం విశేషం. తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో దరఖాస్తులు వచ్చినట్లుగా తెలుస్తుంది.ఇక మహిళలు సైతం మద్యం దరఖాస్తులు వెయ్యటానికి పోటీ పడ్డారు. దరఖాస్తు ఫీజు గతంతో పోలిస్తే రెండింతలు పెరిగినా ఏకంగా రెండు లక్షలు చేసినా సరే దరఖాస్తులు వేశారు.  ఈనెల 18వ తేదీన లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను ప్రభుత్వం కేటాయించింది. మొత్తం దరఖాస్తు చేసిన 45,000 మందిలో మద్యం షాపులు దక్కించుకునే ఆ 2216 అదృష్టవంతులు ఎవరో ఈనెల 18న తేలనుంది.

tags : telangana, liquor shops, licences, applications, excise department, lottery

హుజూర్ నగర్ ఎవరి పరం?

ఆ విద్యాసంస్థల రూటే వేరు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *