రాయపాటిని బెదిరించి బుక్ అయిన నకిలీ సీబీఐ

108
Fake CBI officers phone call to tdp Ex MP Rayapati
Fake CBI officers phone call to tdp Ex MP Rayapati
Fake CBI officers phone call to tdp Ex MP Rayapati
మాజీ ఎంపీ టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావుపై  సీబీఐ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే.  రాయపాటి సాంబశివరావు బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు అప్పు చేసి ఎగ్గొట్టడంతో ఆయనపై కేసులు నమోదు చేశారు.అయితే తాజాగా ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం నుంచి రాయపాటికి ఫోన్ కాల్స్ వచ్చాయి. తాము సీబీఐ అధికారులమని నీ కేసులు మాఫీ చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని బెదిరించారని సమాచారం . అంతేకాదు గుంటూరు వచ్చి మరీ రాయపాటిని కలిసి డబ్బులివ్వాలని లేదంటే కేసులు మాఫీ చేయమని బెదిరించారని తెలుస్తుంది. దీనిపై అనుమానం వచ్చిన రాయపాటి సాంబశివరావు నేరుగా ఢిల్లీకి  వెళ్లి సీబీఐ అధికారుల వద్ద ఈ విషయంపై ఆరాతీశారు. అయితే రాయపాటిని సీబీఐ అధికారుల పేరుతో బెదిరిస్తున్న వారు  ఎవరో తెలుసుకోవటం కోసం  నిఘా వేయడంతో అసలు గుట్టు బయటపడింది.
హైదరాబాద్ కు చెందిన మణివర్ణన్ రెడ్డితో పాటు మధురైకి చెందిన సెల్వంలు రాయపాటిని బెదిరించినట్టు సీబీఐ అధికారుల విచారణలో తేలింది. వీరిద్దరూ అత్యాధునిక టెక్నాలజీతో ఢిల్లీ సీబీఐ కార్యాలయం నుంచి ఫోన్ నంబర్ ను మార్ఫింగ్ చేసి ఇలా చేశారని తెలుస్తుంది . వారిద్దరిని అరెస్ట్ చేసి వారి ఇళ్లలో తనిఖీలు చేసి అత్యాధునిక సాంకేతిక పరికరాలు, పెద్ద ఎత్తున సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు రాయపాటినే కాదు సీబీఐ ఈడీ పేరుతో చాలా మందిని మోసం చేశారని డబ్బు గుంజారని సీబీఐ విచారణలో తేలింది.

Fake CBI officers phone call to tdp Ex MP Rayapati,tdp mp, cbi officials, rayapati sambasivarao , guntur , fake cbi officers, money , blackmail , delhi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here