ఆ వార్త‌లు అవాస్త‌వం… ప్రాజెక్ట్ క‌న్‌ఫ‌ర్మ్!

Fake news Project was conformed
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా సినిమా ను తెర‌కెక్కించ‌నున్నాయి.  ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించి ఇటీవ‌ల ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల్లో నిజం లేదు. ప్ర‌స్తుతం మెగాస్టార్  చిరంజీవి `సైరా` చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. స‌క్సెస్‌ఫుల్ స్టార్ డైర‌క్ట‌ర్ కొర‌టాల శివ ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్నారు.  కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మాత‌లు మాట్లాడుతూ “చిరంజీవిగారు హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మేం సంయుక్తంగా సినిమాను రూపొందించ‌నున్నాం. మా సినిమా చిత్రీక‌ర‌ణ ఆగిన‌ట్టు ఇటీవ‌ల ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేదు. మా చిత్ర హీరో చిరంజీవిగారు ప్ర‌స్తుతం `సైరా` చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్త‌వ‌గానే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం ప‌ట్టాలెక్కుతుంది“ అని అన్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article