Fake Notes in Hyderabad

Fake Notes in Hyderabad … పశ్చిమబెంగాల్ ముఠా అరెస్ట్

భాగ్యనగరిలో నకిలీ కరెన్సీ వ్యవహారం కలకలం రేపింది. నకిలీ కరెన్సీ ముఠా గుట్టుని పోలీసులు రట్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా ప్రాంతం నుంచి నకిలీ కరెన్సీని తీసుకొచ్చి హైదరాబాద్‌లో చెలామణి చేయడానికి యత్నించిన అంతరాష్ట్ర ముఠాను సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు.

చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడకు చెందిన మహ్మద్‌ గౌస్‌ పండ్ల వ్యాపారి. 1991లో పోలీసులకు బాంబులతో పట్టుబడటంతో బాంబ్‌ గౌస్‌గా మారాడు. ఇతడిపై పోలీసులు ఉగ్రవాద చర్యల వ్యతిరేక చట్టం (టాడా) కూడా ప్రయోగించారు. ఈజీగా మనీ సంపాదించడం కోసం 2011 నుంచి నకిలీ కరెన్సీ దందా ప్రారంభించాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనేకమంది ఏజెంట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఇతడు అక్కడ నుంచి నకిలీ కరెన్సీని వివిధ మార్గాల్లో నగరానికి రప్పించి చలామణి చేసేవాడు. అలా వచ్చిన మొత్తం నుంచి ఏజెంట్ల వాటాను వారికి పంపేవాడు. ఈ తరహాలో దందా చేస్తూ ఇప్పటికే మోండా మార్కెట్, గోపాలపురం, కంచన్‌బాగ్, గోపాలపురం, శాలిబండ, కాలాపత్తర్, భవానీనగర్, చాంద్రాయణగుట్ట, మీర్‌చౌక్, ఫలక్‌నుమా, చార్మినార్, విజయవాడ, విశాఖపట్నం పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఇప్పటివరకు సిటీలో 13 సార్లు, బయట 2 సార్లు నకిలీ కరెన్సీ కేసుల్లో చిక్కాడు.
బాంబ్‌ గౌస్‌ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి పశ్చిమ బెంగాల్ కు చెందిన ముఠాతో చేతులు కలిపి దందా సాగిస్తున్నాడు.

మాల్దా ప్రాంతం నుంచి నకిలీ కరెన్సీని తీసుకొచ్చి హైదరాబాద్‌లో చెలామణి చేయడానికి యత్నించిన అంతరాష్ట్ర ముఠాను సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఒక బెంగాలీ సహా ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి 3లక్షల 98వేల విలువ గల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తలాబ్ కట్టకు చెందిన మహ్మద్ గౌస్(48), వెస్ట్ బెంగాల్‌కు చెందిన రబీబుల్ షేక్‌(22)లుగా గుర్తించారు. వెస్ట్ బెంగాల్‌కు చెందిన మరో ప్రధాన నిందితుడు అమినుల్ రెహమాన్(32) పరారీలో ఉన్నాడు. పాకిస్తాన్ కేంద్రంగా బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి పశ్చిమ బెంగాల్‌లోకి నకిలీ కరెన్సీ ప్రవేశిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఇంకా ఈ ముఠాలో ఎంతమంది ఉన్నారన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article