‘ఫలక్ నుమా దాస్’ టీజర్ ఆవిష్కరణ

Falaknuma das teaser event

వెళ్ళిపోమాకే, ఈ న‌గ‌రానికేమైంది లాంటి చిత్రాల్లో న‌టించిన విశ్వక్‌ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్ నుమా దాస్’.  క‌రాటే రాజు సమర్పణలో వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్, టెరనోవ పిక్చర్స్ అనుసంధానంతో పూర్తిగా హైద‌రాబాద్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. స‌లోని మిశ్రా, హ‌ర్షిత గౌర్‌, ప్రశాంతి హీరోయిన్స్ గా నటించారు. ‘పెళ్లిచూపులు’ దర్శకుడు  డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పోలీస్ అధికారిగా కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. హీరో విశ్వక్ సేన్ తల్లిగారైన దుర్గ ఈ ట్రైలర్ ను ఆవిష్కరించారు.
అనంతరం హీరో, దర్శకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘వాలంటైన్స్ డే సందర్భంగా టీజర్ విడుదల చేయడానికి కారణం ఇదే నా గర్ల్ ఫ్రెండ్. ఏడాదిగా ఈ సినిమాతోనే గడిపాను. ఇది చిన్న సినిమా కాదు.. దయచేసి అలా రాయొద్దు, మాట్లాడొద్దు. ఈ సినిమాకు ఎంత బడ్జెట్ అవసరమో అంత పెట్టాను. చాలా పెద్ద సినిమా ఇది.. కాకపోతే చిన్నోడు తీశాడంతే. నిజాయితీగా ఉండేవారికి పొగరు ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ లో ఎక్కువమందికి పొగరు ఉండేది అందుకే. కొట్లాటకు పెద్దగా పాయింట్ అవసరం లేదు.. ఇది చాలు. ‘ఈ నగరానికి ఏమైంది’ సమయంలో మాకు నటించి చూపించేవాడు తరుణ్. అప్పటికే నేనీ సినిమా తీయాలనుకున్నాను. దాంతో అప్పుడే తరుణ్ ను నా సినిమాలోని క్యారెక్టర్కు అనుకున్నాను. సెన్సార్ లాంటి అన్ని అడ్డంకులకు సిద్ధపడే ఈ సినిమా చేశాను. ఈ సినిమా తీసింది నాలాంటి వాళ్లకోసం. వాళ్లకు నచ్చుతుంది. నేను చేసిన సినిమా రాంగ్ అయితే ఇప్పుడింత కాన్ఫిడెంట్ గా మాట్లాడలేను’ అన్నారు.

తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ‘ఫలక్ నుమా ప్రాంతంలోని వాస్తవికతను  ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశాడు  విశ్వక్  సేన్.  అక్కడి  భాష, యాసను తెలుగు సినిమాకు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే  అనుమానం ఉండేది.  నిజాయితీగా తీస్తే యాక్సెప్ట్ చేస్తారనే విషయం ఇటీవలి కాలంలో నిరూపితమైంది.  అదే నిజాయితీతో  ఈ సినిమా తీశాడు.  సినిమాలో కొన్ని పదాలు ఏదోలా ఉన్నప్పటికీ  మీనింగ్  మాత్రం జెన్యూన్ గా ఉంటుంది.   సినిమా చూస్తున్నంత సేపు  ఆ క్యారెక్టర్స్ తో కలిసి  ప్రేక్షకులు జీవిస్తారని  భావిస్తున్నాను.  ఈ సినిమా సమయంలో 12 సార్లు విశ్వక్  సేన్ ను చెంప దెబ్బ కొట్టాను. ఇంకా గట్టిగ కొట్టు అనేవాడు. అంత డెడికేటెడ్ గా వర్క్ చేశాడు. ఈ టీమ్ తో కలసి వర్క్ చేయడం ఆనందంగా ఉంది. నేను ఇందులో లేకున్నా నా సినిమాగానే దీన్ని భావించేవాడిని’ అన్నారు

టి. ఎన్. ఆర్. మాట్లాడుతూ ‘ఈమధ్యకాలంలో నాకు చాలా నచ్చిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. అదే స్థాయిలో ఈ సినిమా టీజర్ నచ్చింది. కొంతమంది వ్యక్తులతో ఎలాంటి అనుబంధం లేకపోయినా ఏదో మనల్ని  వారి వైపు ఆకర్షించి నడిపిస్తుంటుంది. అలాంటి వ్యక్తి విశ్వక్. విశ్వక్ ను గతంలో ఒక్కసారే కలిశాను. ఆ తర్వాత ఫోన్ కాల్స్ లో మాత్రమే మాట్లాడుకోవడం. సినిమాను ఈ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేయలేదు.’ అన్నారు.

నిర్మాత క‌రాటే రాజు మాట్లాడుతూ `20 నుంచి 25 సంవ‌త్స‌రాల వ‌య‌సుండే 40 మంది కుర్రాళ్లంతా క‌ష్ట‌ప‌డి వ‌ర్క్ చేశారు. నేచుర‌ల్‌గా రావాల‌ని ప్ర‌య‌త్నించారు. హైద‌రాబాద్‌లో ఇలాంటి ఏరియాలు కూడా ఉన్నాయ‌ని ఎవ‌రికీ తెలియ‌నటువంటి 118 లొకేష‌న్స్ లో తీశారు’ అని చెప్పారు.

సంగీత దర్శకుడు వివేక్ సాగ‌ర్ మాట్లాడుతూ `త‌రుణ్ భాస్కర్, విశ్వ‌క్ చెప్పిన‌ట్టు క‌చ్చితంగా ఇది అథెంటిక్ ఫిల్మ్‌. హైద‌రాబాద్ నేప‌థ్యంలో ఇలాంటి చిత్రం రావ‌డం ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని ఇస్తుంది. ప్రేక్ష‌కులు చూసి ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను. టీమ్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్‌.

నటుడు కౌశిక్ మాట్లాడుతూ `ఇందులో మంచి రోల్ చేశాను. 48 రోజుల‌పాటు షూటింగ్‌లో పాల్గొన్నాను. త‌రుణ్ భాస్కర్ ఇందులో న‌టించ‌డం హ్యాపీగా ఉంది. టీమ్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్‌’ అన్నారు.
రచయిత కిట్టు విస్సా ప్రగడ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యశ్వంత్ మాస్టర్, ప్రశాంతి, వెంకటేష్ కాకుమాను, జీవన్,  సంజిత్, టోని, మోహన్, సందీప్ తదితరులు హాజరయ్యారు.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article