రైతు వేదిక ఉపయోగాలు ఇవే..

#Farmer stage celebrations#

రైతులు చర్చించుకోవడానికి, వ్యవసాయ అధికారులు సలహాలు సూచనలు ఇవ్వడానికి ఒక వేదికను కల్పించే ఉద్దేశంతో రాష్ట్రంలో మొత్తం 2,601 రైతు వేదికలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసలు రైతు వేదికల వల్ల ఉపయోగాలు? వేదికలతో ఏయే లాభాలు చేకూరుతాయా? ఎలా పనిచేస్తుంది? అనే విషయాలు రైతుల కోసం..

రాష్ట్రంలో ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి(ఏఈవో) క్లస్టర్‌ ఉంది. గతంలో ఉన్న మండల వ్యవసాయ అధికారి(ఎంఏవో)కి కూడా ప్రత్యేక కార్యాలయం అంటూ ఉండేది కాదు. మండల పరిషత్‌ కార్యాలయంలోనో, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనో ఓ చిన్న గదిని కేటాయించేవారు. కొన్నిచోట్ల అద్దె భవనాలే దిక్కయ్యేవి. గతంలో ఏఈవోల సంఖ్య పరిమితంగా ఉండేది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏఈవోల వ్యవస్థను బలోపేతం చేసింది. 5 వేల ఎకరాలకు ఒకటి చొప్పున క్లస్టర్‌ను ఏర్పాటుచేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,604 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. ప్రతి క్లస్టర్‌కు ఒక ఏఈవోను నియమించి, వ్యవసాయ కార్యక్రమాల పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

ఏఈవోలందరికీ ట్యాబ్‌లు పంపిణీ చేసినప్పటికీ ప్రత్యేకంగా ఒక చిరునామా, కార్యాలయం అనేది లేదు. ఈ క్రమంలో అన్ని వసతులతో ఒక్కో క్లస్టర్‌కు కార్యాలయ భవనం నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. వాటికి రైతు వేదికలు అని పేరు పెట్టారు. ఏఈవోకు ఒక ప్రత్యేక గది, కంప్యూటర్లకు, సమావేశాల నిర్వహణకు, విత్తనాలు, యాంత్రీకరణ పనిముట్లు ఉంచటానికి ప్రత్యేక గదులు ఉంటాయి. అన్ని క్లస్టరలో ఒకే నమూనాతో భవనాలు నిర్మిస్తుండటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *