నకిలీ విత్తనాలతో మోసపోయిన వేలాది రైతన్నలు

Farmers are Cheated Because Fake Seeds … నష్టపరిహారం కోసం ధర్నా

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రైతాంగాన్ని నకిలీ విత్తనాలు నిండా ముంచాయి. వరి నాటిన నెల రోజులకే కంకులు రావడంతో, నకిలీ విత్తనాలతో మోసపోయామని గ్రహించిన రైతులు వ్యవసాయ శాఖ డివిజన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వేల సంఖ్యలో రైతులు నకిలీ విత్తనాలతో మోసపోయారని, నష్టపరిహారంగా ఎకరాకు 60 వేల రూపాయలు ఇప్పించాలని రైతులు డిమాండ్ చేశారు.
వరి నాటిన నెలరోజులకే కంకులు రావడంతో దిగుబడి తగ్గిపోతుందని, నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి రూ.60వేలు నష్టపరిహారం చెల్లించాలని, నకిలీ విత్తనాలు అంటగట్టిన డీలర్లపై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని, అభిరుచి విత్తనాలు మార్కెట్‌లో అమ్మిన ఆదిత్య కంపెనీని సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పలు కంపెనీలు మార్కెట్లో నకిలీ విత్తనాలు అమ్ముతున్నప్పటికీ వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫలితంగా రైతులు మోస పోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాసిరకం విత్తనాలకు సంబంధించి హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. అధికారులు డీఎన్‌ఎ నివేదిక, పంచనామా రిపోర్టు ఇవ్వాలని ఇరవైరోజులుగా కోరుతున్నా ఇవ్వడం లేదని ఆరోపించారు. రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, అవసరం అనుకుంటే కోర్టును ఆశ్రయిస్తామని రైతులు తేల్చి చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *