రాజధాని గ్రామాల్లో రోజాకు చేదు అనుభవం

142
Farmers Blocked MLA Roja in Amravati
Farmers Blocked MLA Roja in Amravati

Farmers Blocked MLA Roja in Amravati

ఏపీలో రాజధాని అమరావతి కోసం రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళనలు నేటితో 65వ రోజుకు చేరాయి. ఇక ఈ నేపధ్యంలో నేడు రాజధాని అమరావతిలో రోజాకు నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే రోజాను రాజధాని ప్రాంత ప్రజలు అడ్డుకున్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్న రైతులు, మహిళలు.. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులకు రైతుల నిరసన సెగ  చూపించారు. ఇక  తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వంతు వచ్చింది.ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్నారు స్థానికులు. నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన రోజాను.. పెదపరిమి దగ్గర అడ్డుకున్న స్థానికులు అమరావతికి న్యాయం చేయాలంటూ రోజా వాహనం ముందు బైఠాయించి మహిళలు, రైతులు ఆందోళనకు దిగారు. రాజధాని అమరావతి రైతులకు రోజా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఎమ్మెల్యే రోజాను వేరే మార్గంలో బయటకు పంపించారు. ఇక దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .
Farmers Blocked MLA Roja in Amravati,capital amaravati, capital farmers, protests , rk roja, nagari mla, srm university summit

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here