కవితకు అన్నదాతల షాక్

112
Kavitha attend women's conference
Kavitha attend women's conference

FARMERS WILL FILE NOMINATIONS

  • నిజామాబాద్ ఎంపీ బరిలో దిగాలని నిర్ణయం
  • వెయ్యి మంది నామినేషన్లు వేయాలని యోచన

సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవితకు షాక్ ఇవ్వాలని అన్నదాతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో ఆమెపై పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఒకరో, ఇద్దరో కాదు.. ఏకంగా వెయ్యి మంది కవితపై పోటీ చేయడం కోసం నామినేషన్లు వేయబోతున్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. పసుపు, ఎర్రజొన్న మద్దతు ధర కోసం కొంత కాలంగా నిజామాబాద్ రైతులు ఆందోళన చేస్తున్నారు. రోడ్డెక్కి పోరాడినా, ధర్నాలు చేసినా పట్టించుకునే నాథుడే లేకపోవడంతో ఇక బ్యాలెట్‌ పోరుతోనైనా మార్పు వస్తుందన్న నమ్మకంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన రైతులు నిజామాబాద్‌ పార్లమెంటు స్థానానికి నామినేషన్లు వేయబోతున్నారు. మొత్తం వెయ్యి మంది నామినేషన్లు వేయడం ద్వారా తమ నిరసన తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే జరిగితే కవితకు ఇబ్బందులు తప్పవు. రైతుల నిర్ణయం గెలుపు ఓటములపై ప్రభావం చూపించకపోయినా, కొన్ని ఇబ్బందులు మాత్రం ఎదురవుతాయి. ఒక స్థానానికి ఇంతమంది నామినేషన్లు వేసి, పోటీలో ఉంటే ఈవీఎంలు వాడటం వీలుపడదు. అప్పుడు ఆ స్థానానికి బ్యాలెట్ పేపర్ ఉపయోగించాల్సి ఉంటుంది. అనంతరం ఓట్ల లెక్కింపునకు కూడా చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో రైతుల నామినేషన్ల వ్యవహారంపై కవిత, సీఎం కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

TS POLITICS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here