Monday, March 10, 2025

Two Constables Killed in Hit-and-Run గజ్వేల్ లో ఘోర ప్రమాదం.. ఇద్దరు కానిస్టేబుళ్లు దుర్మరణం

  • ఈసీఐఎల్ లో జరుగుతున్న మారథాన్ కోసం వెళుతుండగా ప్రమాదం
  • జాలిగామ బైపాస్ రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో స్పాట్ లోనే మృతి
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు

గజ్వేల్ లో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. జాలిగామ బైపాస్ రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఓ బైక్ ను వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మరణించిన వారిని పంధాములు, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. పరంధాములు రాయపోల్ పోలీస్ స్టేషన్ లో, వెంకటేశ్వర్లు దౌల్తాబాద్ పీఎస్ లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆదివారం ఈసీఐఎల్ లో జరుగుతున్న మారథాన్ లో పాల్గొనేందుకు వారిద్దరూ బైక్ పై బయలుదేరగా జాలిగామ బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగిందని వివరించారు. కాగా.. ఈ ప్రమాదంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కానిస్టేబుళ్ల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హరీశ్ రావు హామీ ఇచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com