కన్న బిడ్డనే కాటేస్తున్న కసాయి తండ్రి

Father Cruelty on his Kids

మానవత్వం మంటగలిసి పోతుంది. రాక్షసత్వం రాజ్యమేలుతుంది. రక్త సంబంధానికి కూడా అర్ధం లేకుండా పోతుంది. కంటికి రెప్పలా కాపాడుకోవలసిన తండ్రి కన్నకూతురిపై కన్నేశాడు. తాగిన మైకంలో కన్న కూతురిపైన రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని నేరేట్‌మెట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలోని ద్వారకామయి కాలనీలో ఉంటున్న రాజేశ్ అనే వ్యక్తికి భార్య, ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు.

తొమ్మిదేళ్ల క్రితం మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు కుటుంబంతో సహా ఉపాధి కోసం వచ్చిన రాజేశ్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తాగిన మైకంలో నిద్రపోతున్న తన ఐదేళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. గమనించిన అతని భార్య పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న అతడిని పట్టుకొని అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితుడిని రిమాండ్ కు పంపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article