వింత పూజలు తో కూతురు ఫై తండ్రి హత్యాయత్నం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం పేరారెడ్డిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. శాంతి పూజల నెపంతో పూర్విక (4), పునర్విక (4) అనే కవల పిల్లలని తండ్రి వేణు గదిలోకి తీసుకు వెళ్లాడు. అనంతరం వింత పూజలు నిర్వహించాడు. ఆపై పునర్వకని గొంతు నులమడంతో, కేకలు వేస్తూ పూర్విక బయటకు పరుగులు తీసింది. స్థానికులు వెళ్లి చూసేసరికి పునర్విక అపస్మారక స్థితికి చేరుకుంది. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వేణుని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article