Telugu States News https://tsnews.tv/ TSNEWS Mon, 23 Dec 2024 20:40:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 https://i0.wp.com/tsnews.tv/wp-content/uploads/2023/08/cropped-TSLOGO.png?fit=32%2C32&ssl=1 Telugu States News https://tsnews.tv/ 32 32 231764575 CV Anand Apologizes సహనాన్ని కోల్పోయా..క్షమించండి https://tsnews.tv/cv-anand-apologizes-for-remarks-against-national-media/ https://tsnews.tv/cv-anand-apologizes-for-remarks-against-national-media/#respond Mon, 23 Dec 2024 20:40:28 +0000 https://tsnews.tv/?p=27146 జాతీయ మీడియాకు సిపి సివి ఆనంద్‌ ‌క్షమాపణలు ఎక్స్ ‌వేదికగా వెల్లడించిన కమిషనర్‌ హైదరాబాద్‌ ‌సీపీ సీవీ ఆనంద్‌ ‌క్షమాపణలు చెప్పారు. జాతీయ మీడియాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పోస్ట్ ‌పెట్టారు. సంధ్య థియేటర్‌ ‌ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలిపారు. సంధ్య థియేటర్‌ ‌వద్ద అసలేం జరిగిందో తెలుపుతూ నగర పోలీసు కమిషనర్‌ ‌సీవీ ఆనంద్‌ ‌మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.. థియేటర్‌లో ఆరోజు […]

The post CV Anand Apologizes సహనాన్ని కోల్పోయా..క్షమించండి appeared first on Telugu States News.

]]>
  • జాతీయ మీడియాకు సిపి సివి ఆనంద్‌ ‌క్షమాపణలు
  • ఎక్స్ ‌వేదికగా వెల్లడించిన కమిషనర్‌
  • హైదరాబాద్‌ ‌సీపీ సీవీ ఆనంద్‌ ‌క్షమాపణలు చెప్పారు. జాతీయ మీడియాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పోస్ట్ ‌పెట్టారు. సంధ్య థియేటర్‌ ‌ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలిపారు. సంధ్య థియేటర్‌ ‌వద్ద అసలేం జరిగిందో తెలుపుతూ నగర పోలీసు కమిషనర్‌ ‌సీవీ ఆనంద్‌ ‌మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.. థియేటర్‌లో ఆరోజు ఏం జరిగిందో తెలుపుతూ కొన్ని వీడియోలను విడుదల చేశారు. ఈక్రమంలో మీడియా ఆయన్ను కొన్ని విషయాలపై ప్రశ్నించగా.. నేషనల్ ‌మీడియా ఈ ఘటనకు మద్దతు ఇస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    దీంతో అక్కడ ఉన్న కొందరు జర్నలిస్టులు ఈ ఆరోపణలను తప్పుపట్టారు. తాజాగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు సీవీ ఆనంద్‌ ఎక్స్‌లో పోస్ట్ ‌పెట్టారు. ‘ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. ప్రెస్‌‌ట్‌లో రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో నేను కాస్త సహనాన్ని కోల్పోయాను. పరిస్థితులు ఎలా ఉన్నా సంయమనం పాటించాల్సి ఉంటుంది. నేను చేసింది పొరబాటుగా భావిస్తున్నాను. నేషనల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా. క్షమాపణలు కోరుతున్నా‘ అని తెలిపారు.

    ఇక ఈ ఘటనపై సినీ నటి, కాంగ్రెస్‌ ‌నాయకురాలు మాజీ ఎంపీ విజయశాంతి స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్‌పై కేంద్రమంత్రులు ఆరోపణలు చేయడం గర్హనీయమన్నారు. ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బిజెపి నేతలు యత్నిస్తున్నారన్నారు. సినీ పరిశ్రమకు అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావాలని.. ఇలాంటి ఘటనలు జరగకుండా సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు.

    The post CV Anand Apologizes సహనాన్ని కోల్పోయా..క్షమించండి appeared first on Telugu States News.

    ]]>
    https://tsnews.tv/cv-anand-apologizes-for-remarks-against-national-media/feed/ 0 27146
    స్మగ్లర్‌ను హీరోగా చూపించడమేంటి? https://tsnews.tv/minister-seetha-sensational-comments-on-actors/ https://tsnews.tv/minister-seetha-sensational-comments-on-actors/#respond Mon, 23 Dec 2024 20:19:49 +0000 https://tsnews.tv/?p=27142 అలాంటి సినిమాలకు అవార్డులా? పుష్ప లాంటి సినిమాలతో నేర ప్రవృత్తి మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు జై భీమ్‌ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదు.. అలాంటి సినిమాలకు ప్రోత్సాహాలు లేవు.. కానీ ఒక స్మగ్లర్‌ పోలీస్‌ బట్టలు విప్పి నిలబెట్టిన సినిమాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం దేనికి సంకేతం అని మంత్రి సీతక్క ప్రశ్నించారు.  స్మగ్లర్‌ హీరో అంటే అదేం సినిమా…? స్మగ్లర్‌ హీరో.. స్మగ్లింగ్‌ కట్టడి చేసే పోలీస్‌ విలన్‌ ఎలా అవుతాడు..? […]

    The post స్మగ్లర్‌ను హీరోగా చూపించడమేంటి? appeared first on Telugu States News.

    ]]>
  • అలాంటి సినిమాలకు అవార్డులా?
  • పుష్ప లాంటి సినిమాలతో నేర ప్రవృత్తి
  • మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
  • జై భీమ్‌ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదు.. అలాంటి సినిమాలకు ప్రోత్సాహాలు లేవు.. కానీ ఒక స్మగ్లర్‌ పోలీస్‌ బట్టలు విప్పి నిలబెట్టిన సినిమాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం దేనికి సంకేతం అని మంత్రి సీతక్క ప్రశ్నించారు.  స్మగ్లర్‌ హీరో అంటే అదేం సినిమా…? స్మగ్లర్‌ హీరో.. స్మగ్లింగ్‌ కట్టడి చేసే పోలీస్‌ విలన్‌ ఎలా అవుతాడు..? అని అడిగారు.

    సందేశాత్మక సినిమాలు తీస్తే ప్రజలు స్వాగతిస్తారని రెండు మర్దర్లు చేసిన నేరస్తుడు మహారాష్ట్రలో పుష్ప 2 సినిమా చూస్తూ దొరికాడని, ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయని అన్నారు.  మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాలని, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సినిమాలకు ప్రోత్సాహం అందించాలి కోరారు. చంకలో బిడ్డపెట్టుకుని ఒక పేద మహిళపై హక్కులు కోసం పోరాడిన జై భీమ్‌ సినిమాకు అవార్డు రాలేదని, కానీ సినిమాలను గౌరవించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

    The post స్మగ్లర్‌ను హీరోగా చూపించడమేంటి? appeared first on Telugu States News.

    ]]>
    https://tsnews.tv/minister-seetha-sensational-comments-on-actors/feed/ 0 27142
    అల్లు అర్జున్‌పై ప్రభుత్వం కక్షసాధింపు https://tsnews.tv/allu-arjun-was-attacked-by-the-government/ https://tsnews.tv/allu-arjun-was-attacked-by-the-government/#respond Mon, 23 Dec 2024 20:06:27 +0000 https://tsnews.tv/?p=27138 సంధ్యా థియేటర్‌ ఘటన పోలీసుల వైఫల్యం మీడియాతో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అల్లు అర్జున్‌ ఎపిసోడ్‌పై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మరోసారి స్పందించారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం కిషన్‌రెడ్డి మాట్లాడారు.ఈ ఘటనలో పోలీసుల వైఫల్యమే ఉందన్నారు. ప్రభుత్వం ఈ ఘటనను అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఈ సంఘటన జరగకుండా చూసుకోవడంలో పోలీసులు పకడ్బందీగా ఎందుకు వ్యవహరిం చలేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రాజకీయాలకు సినిమాలకు ఏం సంబంధమని నిలదీశారు. ఇది రేవంత్‌ […]

    The post అల్లు అర్జున్‌పై ప్రభుత్వం కక్షసాధింపు appeared first on Telugu States News.

    ]]>
  • సంధ్యా థియేటర్‌ ఘటన పోలీసుల వైఫల్యం
  • మీడియాతో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి
  • అల్లు అర్జున్‌ ఎపిసోడ్‌పై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మరోసారి స్పందించారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం కిషన్‌రెడ్డి మాట్లాడారు.ఈ ఘటనలో పోలీసుల వైఫల్యమే ఉందన్నారు. ప్రభుత్వం ఈ ఘటనను అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఈ సంఘటన జరగకుండా చూసుకోవడంలో పోలీసులు పకడ్బందీగా ఎందుకు వ్యవహరిం చలేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రాజకీయాలకు సినిమాలకు ఏం సంబంధమని నిలదీశారు. ఇది రేవంత్‌ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగానే చూడాలని అన్నారు. సంధ్యా థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు.

    తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇవ్వడంతో చర్లపల్లి సెంట్రల్‌ జైలు నుంచి బన్నీని విడుదల చేశారు. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ విషయంపై మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఏడాది పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో సాధించింది ఏం లేదని అన్నారు. రెండు పార్టీలు ప్రజలను నమ్మించి మోసం చేశాయని విమర్శలు చేశారు. ఈ ఏడాదిలో బీజేపీ చాలా సవాళ్లను ఎదుర్కొందని అన్నారు. వొచ్చే ఏడాదిలో ప్రజల మనోభిష్టం మేరకు పనిచేస్తామని తెలిపారు. తమ ముందు ఇంకా అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. బీజేపీ , కాంగ్రెస్‌ పార్టీలు ఒక్కటే అని ఎవరు అనరని.. బీజేపీ సిద్దాంతమే కాంగ్రెస్‌ పార్టీను ఓడిరచడమని తెలిపారు. కాంగ్రెస్‌కు తాము ఎప్పుడు వ్యతిరేకమేనని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేస్తున్నామంటూ బీజేపీపై ఎవరు మాట్లాడినా అది తెలివి తక్కువ తనమే అవుతుందని కిషన్‌రెడ్డి విమర్శించారు.

    The post అల్లు అర్జున్‌పై ప్రభుత్వం కక్షసాధింపు appeared first on Telugu States News.

    ]]>
    https://tsnews.tv/allu-arjun-was-attacked-by-the-government/feed/ 0 27138
    అల్లు అర్జున్‌ ఇంటి దాడి కేసులో నిందితులకు బెయిల్‌ https://tsnews.tv/allu-arjun-home-attack-case-accused-bail/ https://tsnews.tv/allu-arjun-home-attack-case-accused-bail/#respond Mon, 23 Dec 2024 19:59:35 +0000 https://tsnews.tv/?p=27135 అల్లు అర్జున్‌  ఇంటిపై దాడి కేసులో నిందితులకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి అల్లు అర్జున్‌పై విమర్శలు చేయడం, తన వ్యక్తిత్వంపై దుష్ప్రచారం జరుగుతున్నదని అల్లు అర్జున్‌ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆదివారం మరోసారి ఉద్రిక్తత పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్‌ ఇంటిపై 10 మంది యువకులు దాడి చేశారు. గేట్లను తోసుకుంటూ ఇంట్లోకి వెళ్లారు. అడ్డుకున్న సిబ్బందిని చితకబాదారు. ఆవరణలోని పూలకుండీలను ధ్వంసం చేశారు. పోలీసులు […]

    The post అల్లు అర్జున్‌ ఇంటి దాడి కేసులో నిందితులకు బెయిల్‌ appeared first on Telugu States News.

    ]]>
    అల్లు అర్జున్‌  ఇంటిపై దాడి కేసులో నిందితులకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి అల్లు అర్జున్‌పై విమర్శలు చేయడం, తన వ్యక్తిత్వంపై దుష్ప్రచారం జరుగుతున్నదని అల్లు అర్జున్‌ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆదివారం మరోసారి ఉద్రిక్తత పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్‌ ఇంటిపై 10 మంది యువకులు దాడి చేశారు. గేట్లను తోసుకుంటూ ఇంట్లోకి వెళ్లారు. అడ్డుకున్న సిబ్బందిని చితకబాదారు. ఆవరణలోని పూలకుండీలను ధ్వంసం చేశారు.

    పోలీసులు అక్కడికి వొచ్చి యువకులను అరెస్ట్‌ చేశారు. అల్లు అరవింద్‌ మేనేజర్‌ కాంతారావు ఫిర్యాదు మేరకు కేసు బీఎన్‌ఎస్‌ 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఓయూ జేఏసీ నేతలుగా చెప్పుకున్న వారిని చౌటుప్పల్‌కు చెందిన నాగరాజ్‌, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నగేశ్‌, కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన రెడ్డి శ్రీనివాస్‌, మోహన్‌, చర్లపల్లికి చెందిన ప్రేమ్‌కుమార్‌, షాద్‌నగర్‌కు చెందిన ప్రకాశ్‌గా గుర్తించారు. కాగా, సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌ పోలీసులు నిందులను వనస్థలిపురంలోని జడ్జి నివాసంలో హాజరుపరిచారు. దీంతో వారికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. రూ.10 వేల చొప్పున ఒక్కొక్కరు రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించారు.

    ఓయూ జేఏసీ నేతలు కాదు.. దాడికి పాల్పడిన వారు ఓయూ జేఏసీ పేరుతో ప్లకార్డులు ప్రదర్శించారు. కానీ వాళ్లు ఓయూ జేఏసీ నేతలు కాదని పోలీసులు స్పష్టంచేశారు. దాడిలో కీలక పాత్ర పోషించిన రెడ్డి శ్రీనివాస్‌ కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా గుర్తించారు. 2019లో కాంగ్రెస్‌ నుంచి జడ్పీటీసీగా కూడా పోటీ చేశాడని, అతడు సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తుంటాడని తెలుస్తోంది . మిగిలిన యువకులు కూడా కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పని చేస్తున్నారని సమాచారం. మరోవైపు దాడిలో పాల్గొన్న రెడ్డి శ్రీనివాస్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మళ్లీ 1500మందితో వొచ్చి దాడి చేస్తామని ఆ వీడియోలో హెచ్చరించాడు.

    The post అల్లు అర్జున్‌ ఇంటి దాడి కేసులో నిందితులకు బెయిల్‌ appeared first on Telugu States News.

    ]]>
    https://tsnews.tv/allu-arjun-home-attack-case-accused-bail/feed/ 0 27135
    KCR and Harish Rao Quash Petitions హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు క్వాష్ పిటిషన్లు https://tsnews.tv/kcr-and-harish-rao-quash-petitions-in-high-court/ https://tsnews.tv/kcr-and-harish-rao-quash-petitions-in-high-court/#respond Mon, 23 Dec 2024 17:07:42 +0000 https://tsnews.tv/?p=27131 బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీష్ రావు కలిసి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ భూపాలపల్లి కోర్టు పంపిన నోటీసులను కొట్టివాయాలని వారు కోరారు. మేడిగడ్డ నిర్మాణంలో ప్రమాణాలు పాటించలేదని, దీనివలన ప్రజాధనం వృధా అయ్యిందని రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి జిల్లా కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జిల్లా కోర్టు ఈ ఏడాది జూలై 10న కేసీఆర్, హరీష్ రావు […]

    The post KCR and Harish Rao Quash Petitions హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు క్వాష్ పిటిషన్లు appeared first on Telugu States News.

    ]]>
    బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీష్ రావు కలిసి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ భూపాలపల్లి కోర్టు పంపిన నోటీసులను కొట్టివాయాలని వారు కోరారు. మేడిగడ్డ నిర్మాణంలో ప్రమాణాలు పాటించలేదని, దీనివలన ప్రజాధనం వృధా అయ్యిందని రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి జిల్లా కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు.

    దీనిపై విచారణ చేపట్టిన జిల్లా కోర్టు ఈ ఏడాది జూలై 10న కేసీఆర్, హరీష్ రావు సహా ఆరుగురు వ్యక్తులకు నోటీసులను పంపించింది. అయితే ఈ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు తాజాగా పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది.

    The post KCR and Harish Rao Quash Petitions హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు క్వాష్ పిటిషన్లు appeared first on Telugu States News.

    ]]>
    https://tsnews.tv/kcr-and-harish-rao-quash-petitions-in-high-court/feed/ 0 27131
    TS Police anotice to Allu Arjun అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. మరోసారి పోలీసులు https://tsnews.tv/police-again-big-shock-to-allu-arjun/ https://tsnews.tv/police-again-big-shock-to-allu-arjun/#respond Mon, 23 Dec 2024 16:07:09 +0000 https://tsnews.tv/?p=27127 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు రావాలని నోటీసులో తెలిపారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మరోసారి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు(మంగళవారం) ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీసులో పోలీసులు తెలిపారు. సంధ్యా థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు. సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కి సలాటలో ఒకరి మృతిచెందగా మరొక పరిస్థితి విషమంగా ఉంది […]

    The post TS Police anotice to Allu Arjun అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. మరోసారి పోలీసులు appeared first on Telugu States News.

    ]]>
    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు రావాలని నోటీసులో తెలిపారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మరోసారి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు(మంగళవారం) ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీసులో పోలీసులు తెలిపారు.

    సంధ్యా థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు. సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కి సలాటలో ఒకరి మృతిచెందగా మరొక పరిస్థితి విషమంగా ఉంది . ఇప్పటికే ఈ కేసులో అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు నుంచి నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను అల్లు అర్జున్ పొందారు.

    The post TS Police anotice to Allu Arjun అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. మరోసారి పోలీసులు appeared first on Telugu States News.

    ]]>
    https://tsnews.tv/police-again-big-shock-to-allu-arjun/feed/ 0 27127
    బెయిల్‌ పిటిషన్‌ రిజెక్టెడ్‌ https://tsnews.tv/bail-pitishan-rejected/ https://tsnews.tv/bail-pitishan-rejected/#respond Mon, 23 Dec 2024 10:48:22 +0000 https://tsnews.tv/?p=27123 మోహన్ బాబుకు హైకోర్టులో షాక్ జర్నలిస్టు మీద దాడి కేసులో నటుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. త్వరలోనే మోహన్‌బాబును అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. మెహన్ బాబుకు హైకోర్టు‌లో షాక్ తగిలింది. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటీషన్‌ ను హైకోర్టు కొట్టివేసింది. మోహన్ బాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు హై కోర్టు నిరాకరించింది. మోహన్ బాబు ప్రతివాద లాయర్ మాట్లాడుతూ.. హత్యాయత్నం కేసు పెట్టడంతోనే జర్నలిస్ట్‌ను […]

    The post బెయిల్‌ పిటిషన్‌ రిజెక్టెడ్‌ appeared first on Telugu States News.

    ]]>
    మోహన్ బాబుకు హైకోర్టులో షాక్

    జర్నలిస్టు మీద దాడి కేసులో నటుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. త్వరలోనే మోహన్‌బాబును అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తున్నది.
    మెహన్ బాబుకు హైకోర్టు‌లో షాక్ తగిలింది. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటీషన్‌ ను హైకోర్టు కొట్టివేసింది. మోహన్ బాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు హై కోర్టు నిరాకరించింది. మోహన్ బాబు ప్రతివాద లాయర్ మాట్లాడుతూ.. హత్యాయత్నం కేసు పెట్టడంతోనే జర్నలిస్ట్‌ను మోహన్ బాబు కలిశారని చెప్పాడు. అంతేకాకుండా మోహన్ బాబు ఎవరైనా ప్రభావితం చేయగల వ్యక్తి అని.. బెయిల్ అస్సలు ఇవ్వొద్దని ప్రతివాద లాయర్ తెలిపాడు. అరెస్ట్ చేస్తారనే భయంతోనే మోహన్ బాబు దుబాయ్‌కు వెళ్లాడని ఆరోపించాడు.
    ఈ నెల 13న మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు దాడి చేసిన నేపథ్యంలో పహాడీషరీఫ్‌ పోలీసులు ఆయనపై బీఎన్‌ఎస్‌ 118 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. కుటుంబంలో ఆస్తి వివాదం నేపథ్యంలో మంగళవారం జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసానికి మీడియా ప్రతినిధులు వెళ్లారు. మోహన్‌బాబుతో పాటు వచ్చిన అనుచరులు, బౌన్సర్స్, సహాయకులు గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేయడంతో పాటు కర్రలతో దాడి చేశారు. కొద్దిసేపటి వరకు అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఓ ఛానల్‌ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్‌బాబు మైకు లాక్కుని ముఖంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టేయడంతో మరో ఛానల్‌ కెమెరామెన్‌ కూడా కింద పడ్డాడు. దీంతో దాడిని నిరసిస్తూ మీడియా ప్రతినిధులు ధర్నా చేశారు. మోహన్‌బాబుపై కేసు నమోదు చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో మోహన్‌బాబుపై పహాడిషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. మోహన్ బాబు పై బి,యన్,ఎస్, 18క్లాజ్ 1కింద కేసు నమోదైంది.
    దీంతో మోహన్‌బాబు హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. పలుమార్లు దీనిపై విచారించిన హైకోర్టు.. ముందస్తు బెయిల్‌ ఇవ్వలేదు. సోమవారం మరోసారి విచారించిన న్యాయస్థానం.. ఈ పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో ఆయన్ను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

    The post బెయిల్‌ పిటిషన్‌ రిజెక్టెడ్‌ appeared first on Telugu States News.

    ]]>
    https://tsnews.tv/bail-pitishan-rejected/feed/ 0 27123
    దర్యాప్తు ప్రభావితం https://tsnews.tv/bunny-bail-cancel/ https://tsnews.tv/bunny-bail-cancel/#respond Mon, 23 Dec 2024 09:04:32 +0000 https://tsnews.tv/?p=27120 బన్ని బెయిల్‌ రద్దు చేయండి.. కోర్టుకు పోలీసులు..? అల్లు అర్జున్‌కు మరో బిగ్ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనపై ఆయన విలేకరులతో మాట్లాడటాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే పోలీస్‌ వర్గాలు ఆయన్ను టార్గెట్‌ చేసినట్లుగా తెలుస్తోంది. అతని బెయిల్‌ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. దీంతో అల్లు అర్జున్‌కు ఉచ్చు బిగుసుకుంటోంది. ఇటీవలే 4 వారాలపాటు మధ్యంతర బెయిల్‌పై బయటకొచ్చిన ఆయన సంధ్య థియేటర్ ఘటనపై ప్రెస్‌మీట్ పెట్టడం […]

    The post దర్యాప్తు ప్రభావితం appeared first on Telugu States News.

    ]]>
    బన్ని బెయిల్‌ రద్దు చేయండి.. కోర్టుకు పోలీసులు..?

    అల్లు అర్జున్‌కు మరో బిగ్ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనపై ఆయన విలేకరులతో మాట్లాడటాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే పోలీస్‌ వర్గాలు ఆయన్ను టార్గెట్‌ చేసినట్లుగా తెలుస్తోంది. అతని బెయిల్‌ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. దీంతో అల్లు అర్జున్‌కు ఉచ్చు బిగుసుకుంటోంది. ఇటీవలే 4 వారాలపాటు మధ్యంతర బెయిల్‌పై బయటకొచ్చిన ఆయన సంధ్య థియేటర్ ఘటనపై ప్రెస్‌మీట్ పెట్టడం మరింత దుమారం రేగుతోంది. కేసు కోర్టులో ఉండగానే.. తాను ఏ తప్పూ చేయలేదని, తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం కూడా తనకు తెలీదని ప్రెస్ మీట్‌లో చెప్పారు. ఆ మరుసటి రోజు ఆమె చనిపోయిన విషయం తెలిసి షాక్‌కి గురయ్యానన్నారు. ఇదంతా కేసును ప్రభావితం చేసే విధంగా ఉందని పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

    నా తప్పేం లేదు
    ప్రెస్‌మీట్‌లో బన్నీ మాట్లాడిన తీరును పోలీసులు తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. సినిమా చూస్తున్న సమయంలో పోలీసులు తన వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్పారని అంటున్నారని.. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. తనను పోలీసులు కలవలేదని, తనపై తప్పుడు అలిగేషన్స్ చేస్తున్నారని ఆవేదన చెందారు. తాను అన్ని జాగ్రత్తలు, పర్మిషన్స్ తర్వాతే థియేటర్ వెళ్లానని చెప్పారు. తాను రోడ్ షో చేయలేదన్నారు. ఇక సినిమా చూస్తున్న సమయంలో జనం ఎక్కువయ్యారు వెళ్లిపోవాలని మా టీమ్ చెప్పగానే వెళ్లిపోయానని చెప్పుకొచ్చారు.

    హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్
    దీంతో అల్లు అర్జున్ విలేకరులతో మాట్లాడటాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. అతని బెయిల్‌ను రద్దు చేయాలంటూ నేడో, రేపో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు టాక్. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. మధ్యంతర బెయిల్‌పై ఉన్న సమయంలో ఇలాంటి ప్రెస్‌మీట్లు నిర్వహించడం నిబంధనలకు విరుద్దమని పోలీసులు తప్పు పడుతున్నారు. అల్లు అర్జున్‌ ప్రెస్ మీట్ పెట్టడం వల్లనే ఇది మరింత ఉదృతం అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పోలీసులు సైతం సీరియస్ ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటనపై మాట్లాడిన అనంతరం బన్నీ ప్రెస్ మీట్ పెట్టడం దుమారం రేపుతోంది. అదీకాకుండా ఈ కేసు కోర్టులో ఉండగానే బన్నీ బయటకొచ్చి ఇలా ప్రెస్‌మీట్‌ పెట్టడంతో దర్యాప్తును ప్రభావితం చేస్తున్నట్లు భావించి పోలీసుల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసేందుకు రెడీ అయ్యారు.

    The post దర్యాప్తు ప్రభావితం appeared first on Telugu States News.

    ]]>
    https://tsnews.tv/bunny-bail-cancel/feed/ 0 27120
    అల్లు అర్జున్‌.. మృత్యుంజయ యాగం చేయ్‌ పుష్ప సినిమా లాభాలాను యాదగిరిగుట్ట హుండీలో వేయండి = వీహెచ్ సూచన https://tsnews.tv/allu-arjun-yadagiri-gutta/ https://tsnews.tv/allu-arjun-yadagiri-gutta/#respond Mon, 23 Dec 2024 09:01:10 +0000 https://tsnews.tv/?p=27117 బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీల వ్యవహారశైలిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హనుమంతరావు మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు శవాల మీద పేలాలు ఎరుకునే రకంగా వ్యవహరిస్తున్నాయని, ఇప్పటికైన రాజకీయ డ్రామాలు ఆపాలని హితవు పలికారు. బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టాలని ఎవరు సలహా ఇచ్చారని ప్రశ్నించారు. పుష్ప 2 సినిమా టికెట్ రేటును స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి పెంచారని, దీనిపై అల్లు అర్జున్ ఒక్కసారి ఆలోచించాలన్నారు. సంధ్య థియేటర్ ఘటన అనంతరం […]

    The post అల్లు అర్జున్‌.. మృత్యుంజయ యాగం చేయ్‌ పుష్ప సినిమా లాభాలాను యాదగిరిగుట్ట హుండీలో వేయండి = వీహెచ్ సూచన appeared first on Telugu States News.

    ]]>
    బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీల వ్యవహారశైలిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హనుమంతరావు మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు శవాల మీద పేలాలు ఎరుకునే రకంగా వ్యవహరిస్తున్నాయని, ఇప్పటికైన రాజకీయ డ్రామాలు ఆపాలని హితవు పలికారు. బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టాలని ఎవరు సలహా ఇచ్చారని ప్రశ్నించారు. పుష్ప 2 సినిమా టికెట్ రేటును స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి పెంచారని, దీనిపై అల్లు అర్జున్ ఒక్కసారి ఆలోచించాలన్నారు. సంధ్య థియేటర్ ఘటన అనంతరం జరిగిన పరిణామాలను పొలిటికల్ పార్టీలు ఎంత సేపటికీ రాజకీయ కక్ష అని అంటున్నాయని గుర్తు చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కక్ష సాధింపు చర్య అని అన్నారని వివరించారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని, మణిపూర్‌లో 90 మంది చనిపోయారని, అక్కడ లా ఆర్డర్ లేదన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయని, తప్పొద్దనే కారణంతో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎంపీ సునీల్‌దత్ తన కొడుకు సంజయ్ దత్ విషయంలో చేసిన తప్పును అంగీకరించారని, అల్లు అర్జున్ తండ్రి అరవింద్ కూడా ఈ విషయంలో మరోసారి ఆలోచించాలన్నారు. శ్రీతేజ్ కోలుకోవాలని అల్లు అర్జున్ మృత్యుంజయ యాగం చేయాలన్నారు. పుష్ప2 సినిమాకు వచ్చిన లాభాలు యాదగిరిగుట్ట స్వామి ఉండిలో వేయాలని వీహెచ్‌ సూచించారు.

    The post అల్లు అర్జున్‌.. మృత్యుంజయ యాగం చేయ్‌ పుష్ప సినిమా లాభాలాను యాదగిరిగుట్ట హుండీలో వేయండి = వీహెచ్ సూచన appeared first on Telugu States News.

    ]]>
    https://tsnews.tv/allu-arjun-yadagiri-gutta/feed/ 0 27117
    డాకు మహరాజ్‌ ఇక రచ్చ రచ్చే…? https://tsnews.tv/daaku-maharaj-ika-racha-rache/ https://tsnews.tv/daaku-maharaj-ika-racha-rache/#respond Mon, 23 Dec 2024 08:06:51 +0000 https://tsnews.tv/?p=27114 బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా బాబి ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌వంశీ నిర్మాణంలో ‘డాకు మ‌హారాజ్’ తెర కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య సినిమా జ‌న‌వ‌రి 12న రిలీజ్ అవుతుంది. అయితే ఇంత వ‌ర‌కూ ప్ర‌చారం ప‌నులు మొద‌ల‌వ్వ‌లేదు. ప్ర‌చారం ఆల‌స్య‌మైనా పీక్స్ లోనే ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా డాకు మ‌హారాజు ప్రెస్ మీట్ లో ఎక్క‌డెక్క‌డ ఈవెంట్లు నిర్వహిస్తున్నారన్న‌ది నిర్మాత నాగ‌వంశీ రివీల్ చేసారు. జ‌న‌వ‌రి 2న ట్రైల‌ర్ రిలీజ్ చేయనున్నారని.. ఆ త‌ర్వాత జ‌న‌వ‌రి 4న […]

    The post డాకు మహరాజ్‌ ఇక రచ్చ రచ్చే…? appeared first on Telugu States News.

    ]]>
    బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా బాబి ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌వంశీ నిర్మాణంలో ‘డాకు మ‌హారాజ్’ తెర కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య సినిమా జ‌న‌వ‌రి 12న రిలీజ్ అవుతుంది. అయితే ఇంత వ‌ర‌కూ ప్ర‌చారం ప‌నులు మొద‌ల‌వ్వ‌లేదు. ప్ర‌చారం ఆల‌స్య‌మైనా పీక్స్ లోనే ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా డాకు మ‌హారాజు ప్రెస్ మీట్ లో ఎక్క‌డెక్క‌డ ఈవెంట్లు నిర్వహిస్తున్నారన్న‌ది నిర్మాత నాగ‌వంశీ రివీల్ చేసారు. జ‌న‌వ‌రి 2న ట్రైల‌ర్ రిలీజ్ చేయనున్నారని.. ఆ త‌ర్వాత జ‌న‌వ‌రి 4న అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నాం అన్నారు. అటుపై జ‌న‌వ‌రి 8న ఆంధ్రాలోని విజ‌య‌వాడ‌-మంగ‌ళ‌గిరి ప్రాంతంలో అభిమానుల స‌మ‌క్షంలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందట. అలాగే సినిమాకి ఎలాంటి పెయిడ్ ప్రీమియ‌ర్లు లేవు. గ‌తంలో అనుకున్న ప్రకార‌మే ముందుకెళ్తున్నాము. తెల్ల‌వారు నాలుగు గంట‌ల‌కు తొలి షో ప‌డుతుంది. బాల‌కృష్ణ ని నేను ఎలా చూడాల నుకున్నానో అలా ఈ సినిమాలో చూస్తున్నాం. జైల‌ర్ సినిమా చూసిన త‌ర్వాత ఓ హీరోని ఇలా కూడా చూపించొచ్చా? అనిపించింది. అప్ప‌టి నుంచి నాకు హీరోని తెర‌పై అలా చూపించాల‌నే ఆశ క‌ల‌గింది.

    The post డాకు మహరాజ్‌ ఇక రచ్చ రచ్చే…? appeared first on Telugu States News.

    ]]>
    https://tsnews.tv/daaku-maharaj-ika-racha-rache/feed/ 0 27114