టీఆర్ఎస్ పార్టీలో త్వరలో పలు కీలక మార్పులు

Few Important Changes in TRS Party… కసరత్తులో గులాబీ బాస్

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ చేయకుండా జాప్యం చేస్తోంది. గులాబీ బాస్ మంత్రివర్గాన్ని విస్తరిస్తే ఆయన భవిష్యత్తు ప్రణాళిక ఏంటో ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. ఒకపక్క కేటీఆర్ కు , మరోపక్క హరీష్ రావుకు మంత్రివర్గంలో స్థానం లేదు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో అందుకు గల కారణాలను రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కుంటున్న గులాబీ బాస్ అందుకు తగ్గట్టుగా వ్యూహాలు పన్నుతున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో అధికార పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాబోయే కాలానికి కాబోయే సీఎంగా చెప్పుకునే కేటీఆర్ కు ఎలాంటి అవరోధాలు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి. ఇందులో భాగంగా ఎంపీ సీట్ల విషయంలో భారీ మార్పులు చేయబోతున్నట్టు తెలుస్తోంది.
అందుకే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీచేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఈ దెబ్బతో నల్గొండలో ఉన్న కొద్దిపాటి కాంగ్రెస్ హవా కూడా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే కేసీఆర్ కు బంగారు బాతుగుడ్డు లాంటి మెదక్ సీట్ ఉండగా కోరి నల్గొండలోకి ఎందుకు వస్తున్నట్టు అని అందరు భావిస్తున్నారు. అయితే అందుకు కారణం లేకపోలేదు.అన్నీ అనుకున్నట్టు జరిగితే తనకు చెందిన మెదక్ సీట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా మేనల్లుడు హరీష్ రావును రంగంలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఇలా చేయడం వల్ల కేసీఆర్ కు రెండు లాభాలు. ఒకటి రాష్ట్రంలో కేటీఆర్ కు ప్రత్యామ్నాయంగా పార్టీలో మరో శక్తి లేకుండా చేయడం ఇక రెండోది పార్లమెంట్ లో తనకు మద్దతుగా మేనల్లుడు ఉండడం. ఇలా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే కాన్సెప్టుతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారట. మొత్తానికి మంత్రివర్గ విస్తరణలో జాప్యం, పార్లమెంటు ఎన్నికల వ్యూహం రెండు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయనేది అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ అధికారపార్టీలో త్వరలో పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి.

Check Out Latest Offers in Amazon

For more Political New

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article