ప్రార్ధనాపరులైన భక్తులు – వారి మనోభావాలు

Few Testimonials on Prayer

1) “ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడానికి నా ఇంటిలో ఒంటరిగా వుండటం నాకు ఇష్టం. —డేవిడ్ బ్రెయినార్డ్
2) “ఒక పక్షికి రెండు రెక్కలేలాగో ఒక విశ్వాసికి బైబిలు,ప్రార్థన అలాంటివి”— సాధు సుందర్ సింగ్
3) లోకంలో పడకుండా వుండాలంటే ఒకే ఒక్క మార్గము ‘మోకాళ్ల మీద పడటమే
చెరసాల నుండి పేతురును దూత బయటకు తీసుకొని వచ్చెను కానీ దూతను చెరసాల దగ్గరకు తీసుకొని వచ్చినది ప్రార్థన”— థామస్ వాట్సన్
4) “పరిశుద్థ గ్రంథాన్ని పట్టు వస్త్రంలా దాచుకోవద్దు,నిత్యం వాడే వస్త్రంలా నలగనిమ్ము” “నేను ఎంత అలసిపోయినప్పటికి తప్పకుండా బైబిలును ధ్యానించిన తర్వాతే నిద్రపోతాను”— డగ్లస్ మెక్ ఆథర్
5) “మన మోకాలు నేలను తాకితే మన ఆత్మీయ జీవితం ఆకాశాన్ని తాకుతుంది”— విలియం కేరీ
6) “ప్రార్థనలో నలిగిపోయిన శరీరాలే దేవునికి నివాస స్థలాలు”— విలియం కేరీ
7) “పవిత్ర గ్రంథమైన బైబిలును శ్రద్ధతో చదవడానికి నా దగ్గర వున్న పుస్తకాలు ఆటంకంగా మారితే నేను వాటన్నింటిని నాశనం చేస్తాను”— మార్టిన్ లూధర్
8) “ప్రపంచంలో చాలా పుస్తకాలు Information ని ఇవ్వగా,మరికొన్ని పుస్తకాలు Reformation ని ఇవ్వగా, కేవలం ఒకే ఒక పుస్తకం Transformation ని ఇస్తుంది. అదే Bible”— బిల్లీగ్రేహం
9) “లోకం దేవుని గూర్చిన జ్ఞానం లేక నశిస్తూ వుంటే కొన్ని క్రైస్తవ సంఘాలు దేవుని సన్నిధి లేని క్షామంతో అలమటిస్తున్నాయి”— A.W.టోజర్
10) “నేను పాపుల పాదాల మీద పడి వారు నిత్య నరకాగ్నికి కారకులు కాకుండునట్లు వేడుకునే భారము నాకు ప్రసాదించు”— హెన్రీ మార్టిన్ 11) “నేను 200 సార్లు బైబిలు చదివాను,అనేక సార్లు ప్రార్థనలకు జవాబులు పొందాను,రక్షింపబడి 70 సంవత్సరాలు ప్రభువు కొరకు బ్రతికాను,అయిననూ నేను దేవుని దృష్టిలో చిన్న వాడినే”— #జార్జి ముల్లర్
12) “ఇప్పటికి నేను బైబిలు గ్రంథమును 100 సార్లు చదివియున్నాను,తొలిసారి దానిని చదివినప్పటికంటే అది ఇప్పుడు ఎంతో మధురముగా వున్నదిష‌# — చార్లెస్ స్పర్జ న్

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article