ఉగ్రదాడికి నిరసన

Fight AGAINST TERRORIST … పాక్ గాయకుల పాటలను తొలగిస్తున్న మ్యూజిక్ కంపెనీలు

పుల్వామా ఉగ్రదాడి.. దేశవ్యాప్తంగా పాకిస్థాన్ పై ఆగ్రహాన్ని కలిగిస్తోంది. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఈ దాడి పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హలో మ్యూజిక్ కంపెనీలు సైతం ఇక నుండి పాక్ నాయకులతో కలిసి పనిచేయడం ఆపాలని నిర్ణయం తీసుకుంటున్నారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో టీ-సిరీస్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌ నుంచి పాకిస్థాన్‌ గాయకుల పాటలను తొలగించింది. పాక్‌ గాయకులతో కలిసి పనిచేయడం ఆపేయాలని మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన(ఎంఎన్‌ఎస్‌).. మ్యూజిక్‌ కంపెనీలను హెచ్చరించింది. దీనికి స్పందించిన టీ-సిరీస్ పాక్‌ సింగర్స్‌ ఫతే అలీ ఖాన్‌, అతిఫ్‌ అస్లాం పాటలను తొలగించినట్లు సమాచారం.
” టీ-సిరీస్‌, సోనీ మ్యూజిక్‌, వీనస్‌, టిప్స్‌ మ్యూజిక్‌ లాంటి భారతీయ మ్యూజిక్‌ కంపెనీలతో మాట్లాడాం. పాకిస్థాన్‌ గాయకులతో పనిచేయడం ఆపేయాలని కోరాం. వెంటనే వాళ్లతో కలిసి పనిచేయడం ఆపలేదంటే వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మా ఆదేశాలకు టీ-సిరీస్ స్పందించింది ” అని ఎంఎన్‌ఎస్‌ సినిమా విభాగం అధ్యక్షుడు అమీ ఖోప్కర్‌ తెలిపారు. గతంలో ఉరీ ఘటన తర్వాత ఎంఎన్‌ఎస్‌ ఇలాంటి హెచ్చరికలే జారీ చేసింది. 48 గంటల్లో పాక్‌ నటులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని అప్పట్లో ఆదేశించింది.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article