Fight Between YCP and Janasena at Kakinada
వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. కాకినాడలో రణరంగం సృష్టించాయి. వైసీపీ జనసేన నేతల పరస్పర దాడులతో కాకినాడ రణరంగాన్ని తలపించింది. స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ పై ప్యాకేజీ స్టార్ అంటూ తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటిని ముట్టడించడానికి బయలుదేరారు.ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు కాకినాడలోని భానుగుడి సెంటర్ వద్ద అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ చోటు చేసుకుంది . ఈ రెండు పార్టీల నేతల మధ్య ఘర్షణ రణరంగాన్ని తలపించింది. రాళ్లదాడి చోటుచేసుకుంది. వైసీపీ నేతలు రాళ్లదాడి చేసినట్టు జనసేన కార్యకర్తలు ఆరోపించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి చెదరగొట్టారు. ఈ దాడుల్లో చాలా మందికి గాయలయ్యాయి. జనసేన మహిళా కార్యకర్తలు గాయపడినట్టు తెలిసింది.ఇక జనసేన కార్యకర్తల ముట్టడిపై ఎమ్మెల్యే ద్వారంపూడి స్పందించారు. తాను ఎవరికీ క్షమాపణ చెప్పేది లేదని.. చంద్రబాబు పవన్ లు ఎన్నిసార్లు జగన్ ను ఉన్మాది తుగ్లక్ అని తిట్టలేదని ప్రశ్నించారు.