చీరల కోసం సిద్దిపేటలో తొక్కిసలాట

Fight For Saree … 20 మందికి గాయాలు

షాపింగ్ మాల్స్ మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. 10 రూపాయలకే చీర ఇస్తామంటూ ప్రకటనలు గుప్పించి చీరల గురించి మహిళలకు ఉండే ఆసక్తి ని సైతం క్యాష్ చేసుకుంటున్నాయి. సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో తొక్కిసలాట చోటు చేసుకుంది. మాల్ నిర్వాహకులు 10 రూపాయలకే ఒక చీర ఆఫర్ ప్రకటించారు. భలే మంచి చౌక భరం అంటూ.. చీరలు కొనేందుకు మహిళలు ఎగబడ్డారు. భారీగా షాపింగ్ మాల్‌కు తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20మంది మహిళకు గాయాలు అయ్యాయి. ఒక్కసారిగా ఊహించని విధంగా మహిళలు రావడం, వారు పోటీలు పడి ముందుకు దూసుకురావడంతో మాల్ నిర్వాహకులకు వారిని కంట్రోల్ చేయడం సాధ్యం కాలేదు. దీంతో తొక్కిసటాలకు దారితీసింది.
10 రూపాయలకు టీ కూడా రావడం లేదు. అలాంటిది ఏకంగా చీర వస్తుందంటే ఎవరైనా వదులుకుంటారా. అందుకే జనాలు ఎగబడ్డారు. షాపింగ్ మాల్ ముందు ఉదయం నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు. వెనకబడితే చీర అందుతుందో లేదో అన్న ఆత్రుతలో కొందరు షాపింగ్ మాల్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మాల్‌ నిర్వాహకులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. తమ సేల్స్ పెంచుకునేందుకు, పబ్లిసిటీ కోసం షాపింగ్ మాల్స్ ఓనర్లు ఈ తరహా ఆఫర్లతో జనాలను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మీడియాలో ప్రకటనలు ఇచ్చే బదులు ఈ తరహా ఆఫర్లు పెడితే షాపింగ్ మాల్ కు ఎగబడతారని షాపింగ్ మాల్స్ యాజమాన్యం ఈ నిర్ణయాన్ని తీసుకుంటోంది. అయితే గతంలో ఇలాంటి నిర్ణయాల వల్ల తొక్కిసలాట ఘటనలు అనేకం జరిగాయి. చీరల కోసం మహిళలు ఎగబడటం, అక్కడ తొక్కిసలాట చోటు చేసుకోవడం జరిగాయి. దీనిని కట్టడి చేయాల్సిన బాధ్యత అటు పోలీసుల పైన, ఇటు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులపైన ఉంది

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article