అధికార పార్టీ నేతల మధ్య వార్

నల్లగొండ జిల్లా: నకిరేకల్ లో.. అధికార పార్టీ నేతల మధ్య వార్ తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య పోరు.. అంతర్గతంగానే ఉన్నా ఇప్పుడు బహిర్గతమయ్యింది. ఓ కార్యక్రమంలో మాజీఎమ్మెల్యే వీరేశం పై.. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్నానని వీరేశం నాపై దుష్ప్రచారం చేస్తున్నాడని.. ఫైరయ్యారు. ఒకరి భూములు లాక్కొని, ఇంకొకరికి కట్టబెట్టిన చరిత్ర వీరేశందంటూ హాట్ కామెంట్స్ చేశారు. పీకే సర్వే ఆధారంగా తనకే టికెట్ అంటూ వీరేశం తన అనుచరులతో అసత్య ప్రచారం చేసుకుంటున్నాడని మండిపడ్డారు. మూడేళ్ళుగా టీఆర్ఎస్ పార్టీలో వీరేశం కు సభ్యత్వం కూడా లేదని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ పార్టీ టికెట్ నాదేననీ.. గెలుపూ తనదేననీ ధీమా వ్యక్తం చేశారు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్ధి లింగయ్య.
బైట్: చిరుమర్తి లింగయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article