ఎగ్జిబిషన్ సొసైటీపై కేసు పెడతానన్న ఎమ్మెల్యే

MLA's Filing case Against Exhibition Society - వ్యాపారుల ఆందోళన

దీంతో వ్యాపారులు నుమాయిష్ సోసైటీ కార్యాలయం ముందు తమకు న్యాయం చేయాల్సిందిగా గురువారం ఆందోళనకు దిగారు. సోసైటీ నిర్వాహకుల నిర్లక్ష్యంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో వ్యాపారులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.సమాచారం అందుకున్న పోలీసులు వారిని సముదాయించి వెనక్కు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై బాధితులు మాట్లాడుతూ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రమాదం జరిగి 14 గంటలు కావొస్తున్నా అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ తమ దగ్గరకు రాలేదని వాపోతున్నారు.

న్యాయం కావాలని సొసైటీని ముట్టడించామని, రూ.లక్షలు అప్పు చేసి ఎగ్జిబిషన్‌లో స్టాళ్లను ఏర్పాటు చేశామని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. 30 నిమిషాల్లో అధికారులు రాకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు.సొసైటీ సభ్యులు వచ్చి తమకు న్యాయం చేస్తామని మాట ఇవ్వాలని తెలిపారు. ఎక్కువగా కాశ్మీర్, యూపీ, బీహార్, గుజరాత్, కర్ణాటకకు చెందిన వ్యాపారులు ఆందోళనలో పాల్గొన్నారు. దీనిపై స్పందించిన నుమాయిష్ సొసైటీ గంటపాటు తమకు సమయమివ్వాలని బాధితులను కోరింది.

అందరికీ న్యాయం చేస్తామని, సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించింది. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకుంటున్నామని, మానవ తప్పిదం వల్ల ప్రమాదం జరిగిందా..? షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇక ఘటనా స్థలినిసందర్శించిన ఎమ్మెల్యే రాజాసింగ్ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అక్రమాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. అగ్నిప్రమాదం సంఘటన జరిగిన నేపథ్యంలో ఘటనా స్థలానికి వెళ్లిన ఆయన బాధితులను పరామర్శించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

సిటీ మధ్యలో ఇంత పెద్ద ఎగ్జిబిషన్ వద్దని గతంలో అసెంబ్లీ వేదికగా చెప్పానన్నారు. గురువారం ఎగ్జిబిషన్ సొసైటీపై కేసు పెడతానని స్పష్టం చేశారు.
ఎగ్జిబిషన్ సొసైటీ అక్రమార్జనపై దృష్టిసారిస్తుందే తప్ప వ్యాపారులు, సందర్శకుల భద్రతపై దృష్టి సారించడం లేదని విమర్శించారు.

ఎగ్జిబిషన్ సొసైటీ అక్రమాలపై తాను న్యాయపోరాటం చేస్తానన్నారు. మరోవైపు ప్రమాదం జరిగి 14గంటలు దాటుతున్న ఇప్పటి వరకు ఒక్క అధికారికి కూడా తమ వద్దకు రాలేదని ఎమ్మెల్యే రాజాసింగ్ వద్ద మెురపెట్టుకున్నారు. తాము లక్షలాది రూపాయలు అప్పుచేసి స్టాల్స్ పెట్టామని తమను ఆదుకోవాలని వారు కోరారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article