ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా నారాయణ దాస్

FILM CHAMBER ELECTIONS

  • ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ పై సి.కల్యాణ్ ప్యానెల్ గెలుపు

తెలుగు ఫిలిం చాంబర్ ఎన్నికల్లో నిర్మాత సి.కల్యాణ్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. మరో నిర్మాత దిల్ రాజు ప్యానెల్ పై భారీ గెలుపు సొంతం చేసుకుంది. సి.కల్యాణ్, ప్రసన్న నేతృత్వం వహిస్తున్న మన ప్యానెల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులతోపాటు సెక్టార్ సభ్యులను కూడా పెద్ద సంఖ్యలో గెలిపించుకుని ఛాంబర్ ను సొంతం చేసుకుంది. దిల్ రాజు నేతృత్వంలోని యాక్టివ్ ప్రొడ్యూసర్స్‌ ప్యానల్‌ విజయం సాధించకపోయినా ఆ ప్యానల్ నుంచి దిల్ రాజు, దామోదర ప్రసాద్‌ ఈసీ సభ్యులుగా విజయం సాధించారు. మొత్తం 12 మంది ఈసీ సభ్యుల్లో 9 మంది కల్యాణ్ నేతృత్వంలోని మన ప్యానెల్ నుంచి గెలుపొందగా, దిల్ రాజు సారధ్యంలోని యాక్టివ్ ప్యానల్ నుంచి ఇద్దరు విజయం సాధించారు. మోహన్‌ గౌడ్‌ ఇండిపెండెంట్‌గా పోటి చేసి విజయం సాధిం‍చారు. 20 మంది సెక్టార్ సభ్యుల్లో మన ప్యానెల్ నుంచి 16 మంది, యాక్టివ్ ప్యానెల్ నుంచి నలుగురు గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా ఎగ్జిబిటర్స్‌ విభాగానికి చెందిన నారాయణ దాస్‌ నారంగ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

TELUGU CINEMA

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article