- అశ్రునయనాలతో అమరవీరునకు అంతిమ వీడ్కోలు
*జాతీయ జెండాలతో దారి పొడుగునా నివాళులర్పించిన యువత, ఎం జి ఆర్ యువసేన సభ్యులు
*200 అడుగుల జాతీయ జెండాతో హెల్పింగ్ హాండ్స్ మరియు ఎం జి యువసేన సభ్యులు ర్యాలీ
*అధికార లాంఛనాలతో అశేష జనవాహిని మధ్యలో అమర్రహే నినాదాలతో వీడ్కోలు
పాతపట్నం మండలం, తామర గ్రామానికి చెందిన CRPF జవాన్ పడ్డాన లవ కుమార్ అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య అధికార లాంఛనాలతో జరిగింది ఎం జి ఆర్ యువసేన సభ్యులు, హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ సభ్యులు, ఆజాద్ వెల్ఫేర్ అసోసియేషన్, ప్రదీప్ యువసేన సభ్యులు, చుట్టుపక్కల గ్రామ యువత జాతీయ జెండాలతో, జాతీయ భావంతో అమరవీరునికి కన్నీటి వీడ్కోలు పలకడం జరిగింది ఈ అంతిమ యాత్రలో ప్రముఖ సామాజిక వేత్త మామిడి గోవిందరావు, హెల్పింగ్ హాండ్స్ పోతురాజు శ్రీధర్ వైస్ ఎంపీపీ సవిరి గాన ప్రదీప్ కుమార్,దారపు ఢిల్లీ శ్వరరావు, నక్క క్రాంతి కుమార్, మిత్తన ప్రసాద రావు, మాజీ ఆర్మీ ఉద్యోగులు,సైలాడ సతీష్, చుట్టుపక్కల గ్రామ యువత తరలి రావడం జరిగింది