గిరిజన క్రీడాకారుడుకి చేయూత

రాజన్నసిరిసిల్ల జిల్లా రాచర్లగుండారంకు చెందిన ముడవత్ వెంకటేష్ అనే అంతర్జాతీయ క్రీడాకారుడుకి గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా టిఆర్ఎస్ యువజన నాయకుడు ఉగ్గం రాకేష్ యాదవ్ (హైద్రాబాద్) 1.8 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. వెంకటేష్ అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ఖోఖో పోటీల్లో పాల్గొని అనేక పతకాలు సాధించాడు. కోచ్ డిప్లొమ కోర్సు కోసం వెంకటేష్ నేతాజీ శుభాష్ జాతీయ క్రీడా సంస్థ(ఎన్ఎస్ఎన్ఐఎస్)లో సీటు సంపాదించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటేశ్ తన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో మంత్రి కేటీఆర్ ని సంప్రదించారు. విషయం తెల్సుకున్న టీఆర్ఎస్ యూత్ నాయకుడు రాకేశ్ ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందజేశారు. రాకేశ్ ని మంత్రి కేటీఆర్ అభినందించారు. కార్యక్రమంలో పోత్గల్ పీఏసీఎస్ చైర్మన్ తన్నీరు బాపురావు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article