Saturday, September 14, 2024

బఫర్ జోన్ పరిధిలో అనురాగ్ కాలేజీల నిర్మాణం

  • ఒక ప్రజా ప్రతినిధిగా చిత్తశుద్ధితో పల్లా హైడ్రాకు సహకరించాలి
  • టిపిసిసి అధికార ప్రతినిధి, చనగాని దయాకర్

సిఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి, హైడ్రా చూపిస్తున్నతెగువకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు జేజేలు పలుకుతున్నారని టిపిసిసి అధికార ప్రతినిధి, చనగాని దయాకర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పదేళ్లుగా గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని లేక్‌లు, చెరువులు, కుంటలు, విధ్వంసానికి గురయ్యాయన్నారు. నడేం చెరువు బఫర్ జోన్ పరిధిలో అనురాగ్ కాలేజీల నిర్మాణం జరిగిందని, పల్లా రాజేశ్వర్ రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు.

సర్వే నెంబర్ 813లో ఆ ఆక్రమణలు జరిగాయని, ఒక ప్రజా ప్రతినిధిగా చిత్తశుద్ధితో పల్లా హైడ్రాకు సహకరించాలని చనగాని డిమాండ్ చేశారు. పల్లా తప్పు చేసి ప్రభుత్యంపై నిందలు వేయడం సరికాదన్నారు. ఉన్నత విద్యామండలి నిబంధనలు ఎక్కడ పాటించ లేదన్నారు. పల్లా యూనివర్సిటీలో లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. బి కేటగిరీ నింబంధనలు పాటించలేదన్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు అనురాగ్ కళాశాలలపై తనిఖీలు చేయలేదన్నారు.

వనరులను కాపాడాలన్న ఉద్ధేశ్యంతోనే ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రకృతిని కాపాడాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారన్నారు. రాష్ట ముఖ్యమంత్రి చెరువులు, లేక్‌లు, కుంటల అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ప్రజలకు రియల్ హీరోగా రేవంత్ నిలిచి పోయారన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular