రైలులో అగ్ని ప్రమాదం

FIRE ACCIDENT IN TRAIN

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. అయితే పెను ప్రమాదం తృుటిలో తప్పిపోయింది. ప్రజల ప్రాణాలకు ఎలాంటి హానీ కలగలేదు. ప్రయాణికుల అప్రమత్తతే వారిని కాపాడింది.

రైలులో అగ్నిప్రమాదం సంభవించి ఒక బోగీ తగలబడిపోయింది. వివరాల్లోకి వెళితే.. యశ్వంత్‌పూర్ నుంచి టాటానగర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌… తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మీదుగా వెళుతోంది…తెల్లవారుజామున సుమారు 2.15 గంటల ప్రాంతంలో పాంట్రీకార్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వీటిని గుర్తించిన ప్రయాణికులు వెంటనే చైను లాగారు… వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది కూడా బోగీలను వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.లేదంటే మంటలు ఇతర బోగీలకు సైతం వ్యాపించి ఉండేవి. సమాచారం అందుకున్న రైల్వే, అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదం కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article