Tuesday, March 11, 2025

బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఇంట్లో మంటలు

జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ బాలీవుడ్‌ బ్యూటీ ముంబై నగరంలో బాంద్రాలోని పాలి హిల్‌ ప్రాంతంలో నవ్రోజ్‌ హిల్‌ సొసైటీఓ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇక్కడ ఎవ్వరికీ ఎటువంటి ప్రమాధం సంభవించలేదు. 17 అంతస్తుల ఎత్తైన భవనంలోని 14వ అంతస్తులోని వంటగదిలో మంటలు చెలరేగినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన‌ కాల్‌ను స్వీకరించిన వెంటనే నాలుగు అగ్నిమాపక యంత్రాలు, మూడు జంబో ట్యాంకర్లు ఒక శ్వాస ఉపకరణం వ్యాన్‌ను సంఘటనా స్థలానికి వేగంగా పంపించారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నౌరోజ్ హిల్ సొసైటీలోని 14వ అంతస్తులోని ఓ గదిలో మంటలు వ్యాపించాయి. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నివాసం భవనం లోపల ఒక విలాసవంతమైన 5 బిహెచ్‌కె అపార్ట్‌మెంట్ ఈ సంఘటన జరిగింది. 2023లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ముంబై- బాంద్రా వెస్ట్‌లోని ప్రతిష్టాత్మకమైన పాలి హిల్ పరిసరాల్లో ఉన్న ఒక విలాసవంతమైన నివాసాన్ని కొనుగోలు చేసింది. గత జూలైలో కొత్త నివాసం వెలుపలి భాగాన్ని ప్రదర్శించే వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా అది అంద‌రి దృష్టిని ఆకర్షించింది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com