ఐదు అక్ష‌రాలు.. ఐదు పాత్ర‌లు

Five Letters and Five Characters
సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ రూపొందిస్తోన్న చిత్రం `చిత్ర‌ల‌హ‌రి`. సినిమా టైటిల్‌లో ఉన్న ఐదు అక్ష‌రాల త‌ర‌హాలోనే సినిమాలో ఐదు పాత్ర‌లు కీల‌కంగా ఉంటాయి. ఆ ఐదు ప్ర‌ధాన పాత్ర‌ల చుట్టూనే క‌థ తిరుగుతుంద‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. అంతే కాకుండా సినిమాను ఈ ఏడాది వేసవి సంద‌ర్భంగా ఏప్రిల్ 12న విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా.. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. వ‌రుస ఆరు అప‌జ‌యాల త‌ర్వాత సాయిధ‌ర‌మ్‌తేజ్ చేస్తోన్న చిత్ర‌మిది. దీనిపై తేజు చాలా న‌మ్మ‌కంగా ఉన్నాడు. మ‌రో ప‌క్క నేను శైల‌జ వంటి స‌క్సెస్ త‌ర్వాత కిషోర్ తిరుమ‌ల చేసిన `ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ` సినిమా స‌క్సెస్ కాలేదు. ఇప్పుడు కిషోర్ తిరుమ‌ల‌కు కూడా ఈ స‌క్సెస్ ఎంతో కీల‌కంగా మారింది. 
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article