Tuesday, April 22, 2025

కల్లు కోసం వచ్చి అనంత లోకాలకు

చెరువులో పడి ఐదుగురు యువకులు మృతి,ఒకరికి గాయాలు

భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జలాల్పురం గ్రామంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెల్లడంతో ఐదుగురు యువకులు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చౌటుప్పల్ ఎసిపి మధుసూదన్ రెడ్డి ,సిఐ రాములు ,ఎస్సై భాస్కర్ రెడ్డి చేరుకొని చెరువులోని మృతదేహాలను బయటకు తీశారు.

వివరాలకు వెళితే హైదరాబాదులోని ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన వంశీ, బళ్ళు, వినయ్, హర్ష, దినేష్ లు శుక్రవారం అర్ధరాత్రి ఇంటి నుండి బయలుదేరి మద్యం సేవించి తెల్లవారుజామున ఈతకల్లు సేవించేందుకు పోచంపల్లికి వచ్చారు. అయితే భోజనం చేసేందుకు వెతకగా భోజనం దొరకకపోవడంతో మళ్లీ రంగారెడ్డి జిల్లా కొత్తగూడెంకు వెళ్లారు.

మళ్లీ పోచంపల్లికి వస్తుండగా మార్గమధ్యంలోని జలాల్పురం గ్రామ లోని చెరువు కట్టపై అతివేగంగా రావడంతో అదుపుతప్పి కారు చెరువులకు దూసుకెళ్లింది. అందులో మెడబోయిన మణికంఠ అనే యువకుడు కారు అద్దాన్ని ధ్వంసం చేసి గాయాలతో బయటపడ్డాడు. మిగతా ఐదుగురికి ఈత రాకపోవడంతో శ్వాస ఆడక మృతి చెందాడు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మెరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com