Flood Relief Amount Stopped
డామిట్ కథ అడ్డం తిరిగింది. ఎన్నికల సందర్భంగా వరద సాయం పేరిట ఓటర్లకు రూ. 10,000 పంచాలన్న అధికార టీఆర్ఎస్ పార్టీ కల చెదిరిపోయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. దీంతో, జీహెచ్ఎంసీ పరిధిలో వరద సాయం కోసం దరఖాస్తుల స్వీకరణ, పంపిణీని నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల్ని జారీ చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరవాత పథకాన్ని యధావిధిగా కొనసాగించుకోవచ్చని ఎస్ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. అసలే కష్టకాలంలో ఉన్నామంటే.. ఈ కొత్త తలనొప్పి ఏమిటని తెరాస శ్రేణులు భావిస్తున్నాయి. అయితే, మరికొందరేమో తెరాస ప్రణాళిక ప్రకారమే ఈ వరద సాయం నిలిచిపోయిందని అంటున్నాయి. వరద సాయం కావాలంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటేస్తేనే ఇస్తారనే ప్రచారం నిర్వహిస్తున్నాయని సమాచారం. ఒకవేళ బీజేపీకి గనక ఓటేస్తే ఈ పది వేలు రావనే రీతిలో ప్రచారం జరుగుతోందని తెలిసింది.