ఇదేం పరిహారం: వరద బాధితుల ఆగ్రహం

Flood Vicitms not get yet Government Fund

వరద బాధితులకు అందిస్తున్న నష్టపరిహారం పక్కదారి పడుతోంది. కొన్ని చోట్ల అవకతవకలు జరుగుతున్నాయి. మరికొన్ని నష్టపరిహారం ఊసే లేదు. ఇంకొన్ని చోట్ల తూతూమంత్రగా కానిచేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం అందకపోవడంతో పాతబస్తీ వాసులు దక్షిణ మండలం జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఉప్పుగూడ, సాయిబాబానగర్‌, శివాజీనగర్‌ అరుంధతి నగర్‌ కాలనీ, భగత్‌సింగ్‌ నగర్‌, రాజీవ్‌ నగర్‌, క్రాంతినగర్‌లతో పాటు పలు బస్తీల మహిళలు ధర్నా చేశారు. సంబంధిత అధికారులు నచ్చచెప్పడంతో బస్తీవాసులు నిరసనను విరమించుకున్నారు.

నల్లకుంట డివిజన్‌లో వరద బాధితులకు రూ.10వేలకు బదులు రూ.5వేలు మాత్రమే పంపిణీ చేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ పై మండిపడ్డారు. కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నష్టపరిహారం ఎందుకు తగ్గించారు? అని అడిగినా అధికార పార్టీ నాయకుల నుంచి సమాధానం కరువైంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు నష్టపరిహారం ఇంకానే అందలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి పబ్బం గడుపుతోందని పలువురు బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *