ఈ టీవీని చాప చుట్టినట్టు చుట్టేయొచ్చు

Fold able Television

  • ఎల్ జీ కొత్త ఆవిష్కరణ
  • ఈ ఏడాది ద్వితీయార్థంలో అందుబాటులోకి…

చాప చుట్టేసినట్టు మన టీవీని కూడా చుట్టేస్తే ఎలా ఉంటుంది? అవసరమైనప్పుడు తీసుకుని, అవసరం లేనప్పుడు చుట్టేసే టీవీ ఉంటే బావుంటుంది కదూ? ఇప్పటివరకు మడతపెట్టే ఫోన్ చూశాం. ఇప్పుడు చుట్టేసే టీవీ కూడా వచ్చేసింది. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఎల్‌జీ సంస్థ.. కొత్తగా చుట్టేసే టీవీని ఆవిష్కరించింది. సిగ్నేచర్ సిరీస్ లో భాగంగా 65 అంగుళాల 4కే సిగ్నేచర్ ఓఎల్‌ఈడీ రోల ప్ మోడల్ టీవీని విడుదల చేసింది. ప్రస్తుతం లాస్ వెగాస్‌లో జరుగుతున్న కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)లో ఈ టీవీని పరిచయం చేసింది. ఈ టీవీని చాలా సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. సౌండ్ బార్ వంటి పరికరంలోనే టీవీ మొత్తం అమరి ఉంటుంది. మనకు అవసరం ఉన్నప్పుడు అందులో మడతపెట్టుకుని ఉన్న టీవీ తెర నెమ్మదిగా బయటకు వచ్చి, టీవీలా రూపాంతరం చెందుతుంది. అవసరం లేనప్పుడు మళ్లీ అందులోకి చుట్టేసుకుంటుంది. గూగుల్ అసిస్టెంట్,  అమెజాన్ అలెక్సా వర్చువల్ అసిస్టెంట్,  యాపిల్‌ ఎయిర్‌ ప్లే సపోర్టు తోపాటు  100 వాల్ట్స్‌ డాల్బీ అట్మాస్‌ స్పీకర్‌ దీని ప్రత్యేకతలు. మారుతున్న టెక్నాలజీతోపాటే మనం వాడే ఉత్పత్తులు కూడా ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చూశాం. తాజాగా మడతపెట్టే టీవీ కూడా వచ్చేసింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇది వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి దీని ధర ఎంతో కంపెనీ వెల్లడంచలేదు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article