అడవులకు వెళుతోన్న తెలుగు హీరోలు

39
forest based movies
forest based movies

forest based movies

అడవి నేపథ్యంలో తెలుగులో అనేక సినిమాలు వచ్చాయి. కొన్ని కమర్షియల్ మూవీస్. మరికొన్ని సందేశాత్మకంగా సాగిన చిత్రాలు. అయితే ఎక్కువగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే ఉన్నాయి. ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకూ ఈ సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ అడవి రాముడుగా, వేటగాడులా అదరగొట్టాడు. చిరంజీవి అడవి దొంగ, కొండవీటి దొంగ చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. ఇక మోహన్ బాబు హీరోగా నటించిన అడవిలో అన్న పూర్తి అభ్యుదయాత్మక చిత్రం. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.  ఆర్. నారాయణమూర్తి సినిమాల గురించి చెప్పేదేముందీ. అన్ని సినిమాలూ ఇంటర్వెల్ నుంచి అడవిబాట పట్టినవే. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న ఆచార్య సైతం అడవి నుంచి ఆలయాల్లోకి వచ్చే కథే అంటున్నారు. ఓ మాజీ నక్సలైట్ ధర్మకోసం సాగించే పోరాటం నేపథ్యంలో ఈ కథ ఉంటుందని రీసెంట్ గా వచ్చిన మోషన్ పోస్టర్ చూస్తే తెలుస్తుంది. అంతకు ముందు నుంచి కూడా ఈ సినిమా గురించి ఇదే వినిపించింది. రాజమౌళి డైరెక్షన్ లో వస్తోన్న రౌద్రరణరుధిరం సైతం అడవి నేపథ్యంలో సాగే కథే. కొమురం భీమ్ అడవి బిడ్డ. అల్లూరి సీతారామరాజు మన్యం వీరులతో కలిసి స్వాతంత్ర్య పోరాటం సాగించాడు.

మరి ఈ అడవి కథను రాజమౌళి ఎలా చూపిస్తాడో అప్పుడే చెప్పలేం కానీ.. ఈకథ చెప్పాలంటే అడవి దాటితే కుదరదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న పుష్ప సైతం అడవిలో సాగే కథే. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగులింగ్ నేపథ్యంలో రాసుకున్న కథ ఇది. అల్లు అర్జున్ ఈ తరహా సినిమా చేయడం మొదటిసారి. ప్యాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందుతోన్న ఈ అడవిలో కథ అల్లు అర్జున్ కు బ్లాక్ బస్టర్ ఇస్తుందంటున్నారు. ఇక రానా ఏకంగా అరణ్యం పేరుతోనే సినిమా చేశాడు. ఏప్రిల్ లోనే విడుదల కావాల్సిన సినిమా కరోనా వల్ల ఆగిపోయింది. ట్రైలర్ ను బట్టి చూస్తే రానా అడవి మనిషి పాత్రలో కనిపిస్తున్నాడు. ఒక వైవిధ్యమైన కథగా వస్తోన్న సినిమా ఇది. లేటెస్ట్ గా వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో ప్రారంభమైన సినిమా కూడా పూర్తిగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథే. ఇప్పటికే వికారాబాద్ అడవుల్లో చిత్రీకరణ మొదలైన ఈ సినిమా తెలుగులోని ఓ పాపులర్ నవలను ఆధారంగా రూపొందిస్తున్నారు. సో.. ప్రస్తుతం తెలుగులో వరుసగా ఐదారు సినిమాల కథలు అడవితో ముడిపడి ఉన్నాయి. మరి ఈ కథల్లో ఏ కథకు ఆడియన్స్ ఎక్కువ మార్కులు వేస్తారో చూడాలి.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here