ఏసీబీ వలలో ఫారెస్టు అధికారులు

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా గగన్ పహాడ్ లోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు, ఒక వ్యాపారి నుండి 80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యామ్ కుమార్, సెక్షన్ ఆఫీసర్ పీర్యానాయక్ దొరికిపోయారు. నగరంలోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన వెంకటేష్ అనే వ్యాపారి శంషాబాద్ మండల్ కొత్వాల్ గూడ సమీపంలో సామిల్ (టింబర్ డిపో) ఏర్పాటుచేయడానికి లైసెన్స్ కోసం దరఖాస్తు చేయగా పీర్యా నాయక్ 80000 రూపాయలు డిమాండ్ చేయడంతో ఏసీబీ ని ఆశ్రయించాడు. రేంజ్ ఆఫీసర్ శ్యామ్ కుమార్ ర్ సెక్షన్ ఆఫీసర్ పీర్యా నాయక్ లను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు వారసిగూడ లోని శ్యామ్ కుమార్ ఇంటిలోనూ, షాద్ నగర్ లోని పీర్యా నాయక్ ఇంటి వద్ద కూడా ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article