కరోనా వైరస్ లీక్ పాపం వుహాన్ లేబరేటరీదే

covid escapes from lab in china says former cdc chief Robert redfield

చైనాలోని వుహాన్ లేబరేటరీ నుంచి కరోనా వైరస్ లీకవలేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్ధారించినప్పటికీ నిపుణులు మాత్రం ఇప్పటికీ సందేహాలు వ్యక్తపరుస్తూనే ఉన్నారు. చైనాలోని ఓ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ తప్పించుకుని ఉంటుందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ & నివారణ సంస్థ మాజీ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ పేర్కొన్నారు.

తన అంచనా ప్రకారం చైనాలోని వుహాన్లో కరోనావ్యాప్తి సెప్టెంబర్, అక్టోబర్లో ప్రారంభమై ఉంటుందన్నారు. కరోనా క్రిములు వుహాన్లోని ఓ ల్యాబ్ నుంచి బయటికి వచ్చేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని తాను ఇప్పటికీ భావిస్తున్నాని ఆయన తెలిపారు. ఇతరులు దీన్ని అంగీకరించకపోయినా, ఏదో ఒకనాడు సైన్స్ దాని నిగ్గు తేల్చుతుందనేది ఆయన వ్యాఖ్య.

తాను ఓ వైరాలజిస్టుననీ, వైరస్లపై చాలాకాలం స్టడీ చేశానని రెడ్ ఫీల్డ్ వివరించారు. ఆ అనుభవంతోనే చెబుతున్నాననీ, ఓ గబ్బిలం నుంచి మానవుడికి కరోనా వైరస్ వ్యాప్తి చెందిందంటే తాను నమ్మబోనని స్పష్టంచేశారు. జంతువుల నుంచి మానవుడికి సంక్రమించిన వైరస్, ఆ తరవాత మానవుడి నుంచి మానవుడికి వ్యాప్తి చెందడానికి చాలా సమయం తీసుకుంటుందని, కానీ ఇది అలా లేదనేది ఆయన అభిప్రాయం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article