టీడీపీకి షాక్ ఇచ్చిన డొక్కా ..రాజీనామా

153
Former minister Dokka Manikya Vara Prasad resigns for TDP
Former minister Dokka Manikya Vara Prasad resigns for TDP

Former minister Dokka Manikya Vara Prasad resigns for TDP

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీకి షాక్ ఇచ్చారు డొక్కా మాణిక్య వరప్రసాద్ .  స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే  డొక్కా రాజీనామా చెయ్యటం సంచలనం కలిగించింది. ఇక టీడీపీకి  చెందిన మరో  సీనియర్ నాయకులు పార్టీని  వీడటానికి రెడీ అయ్యారు. కడప జిల్లా జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి రేపో, మాపో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకోవడానికి సిద్ధపడుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇదివరకే శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు సమయంలో తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో తాను పదవికి రాజీనామా చేస్తున్నానంటూ చెప్పారు.

పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖను రాశారు. అమరావతి ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న పరిస్థితుల్లోనే ఆయన మండలి నుంచి తప్పు కోవడం చర్చనీయాంశమైంది. అప్పటి నుంచీ ఆయన తెలుగుదేశానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఒకవైపు అమరావతి రైతుల ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ వాటిపై  పెద్దగా దృష్టి సారించలేదు.తాజాగా ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ అగ్ర నాయకత్వం వైఖరిని విభేదించడమే దీనికి కారణమని అంటున్నారు. దళితులు, బడుగు, బలహీన వర్గాల వారికి ఇళ్ల స్థలాలను కేటాయించడానికి ప్రభుత్వం అమరావతి పరిధిలోని పలు గ్రామాల్లో భూములను సేకరించడాన్ని టీడీపీ అగ్ర నాయకత్వం తప్పు పట్టడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు.

అమరావతి ఉద్యమం సందర్భంగా కొందరు టీడీపీ నాయకులు తనను విమర్శించడాన్ని డొక్కా మాణిక్య వరప్రసాద్ జీర్ణించుకోలేకపోతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించడాన్ని నిరసించడం వల్ల తెలుగుదేశం పార్టీ అగ్ర కులాలకే వత్తాసు పలుకుతోందనే అభిప్రాయం క్షేత్రస్థాయిలో ప్రజల్లో వ్యక్తమౌతోందని డొక్కా మాణిక్య వరప్రసాద్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఏ మాత్రం టీడీపీ అగ్ర నాయకత్వం అంచనా వేయలేకపోతోందని, ప్రజల నాడిని పసిగట్టడంలో విఫలమైందని డొక్కా అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఇక ఈ నేపధ్యంలో డొక్కా రాజీనామా టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ అనే చెప్పాలి .

Former minister Dokka Manikya Vara Prasad resigns for TDP,andhra pradesh , tdp, chandrababu naidu, dokka manikya varaprasad, resignation , local body elections 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here