ఈతకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Four MEMBERS ARE DIED ON the same family went to swim

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరులో విషాదం చోటు చేసుకుంది. వేసవికాలం కావడంతో చెరువులో సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు విగత జీవులుగా మారారు. కొలనూరులో ఉన్న ఒక చెరువులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఈతకొట్టేందుకు వెళ్లారు. నలుగురు ఈతకొడుతుండగా లోతు తెలియకపోవడంతో మునిగిపోయారు. దీంతో ఊపిరాడక నలుగురు దుర్మరణం చెందారు. మృతిచెందిన నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారే కావడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతులు రాజయ్య, ఆదర్శ్, జిత్తు, సిద్ధార్థగా గుర్తించారు. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెండు మృతదేహాలను వెలుపలికి తీశారు. మరో రెండు మృతదేహాలను వెలికి తియ్యాల్సి ఉంది. అయితే చీకటి పడిపోవడంతో సహాయక చర్యలను నిలిపివేశారు అధికారులు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article