రేసులో ఆ నాలుగు సినిమాలు

Four movie For Sankranthi Race… సంక్రాంతి విజేత ఎవరో తెలుసా ?

ప్రతీ సంక్రాంతి కి పోటాపోటీగా సినిమాలు రిలీజ్ అవుతాయి. అగ్ర తారలు పోటీ పడి మరీ సంక్రాంతి పందెం లో ఉంటారు. అయితే చాలా సార్లు బాలయ్య సినిమాలు సంక్రాంతి విజేతగా నిలిచి సందడి చేస్తాయి. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలను చూస్తే కూడా బాలయ్య సినిమానే టాప్ అనిపిస్తుంది. ఇక సంక్రాంతి రేసులో ఉన్న నాలుగింటిలో చివ‌రి సినిమా విడుద‌లైపోయింది. థియేట‌ర్ల కోసం కొట్లాడిన పేట‌… థియేట‌ర్లు ఇస్తామ‌న్నా నింపుకునే ప‌రిస్థితి లేదు. ఈ సంక్రాంతి నాదే అని చెల‌రేగిన రామ్ చరణ్ సినిమా క‌లెక్ష‌న్ల‌ను గ‌ద్ద ఎత్తుకుపోయింది. ఇక పండ‌గంతా ఎన్టీఆర్ – ఎఫ్ 2 లు చేసుకుంటున్నాయి. పెద్ద‌లంతా ఎన్టీఆర్- క‌థానాయ‌కుడు చూసి మురిసిపోతుంటే… పిల్ల‌లంతా ఎఫ్ 2 చూసి విర‌గ‌బ‌డి న‌వ్వుతున్నారు. మొత్తానికి ఈ రెండు సినిమాలు సంక్రాంతికి విజ్ఞానాన్ని వినోదాన్ని అందించాయి. బాల‌కృష్ణ‌తో రెండో సినిమా తీసిన క్రిష్‌… బాల‌య్య‌ను ఎలా వాడితే మంచి ఔట్ పుట్ వ‌స్తుందో అలా వాడేశారు. బాల‌య్య అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా బాల‌య్య బాగా సూట‌య్యాడే అని మ‌న‌సులోని మాట‌ను త‌ప్ప‌క బ‌య‌ట‌పెడుతున్నారు.
ఇదిలా ఉంటే… సినిమా పుణ్య‌మా అని అన్న ఎన్టీఆర్ అంద‌రి క‌ళ్ల ముందు క‌ద‌లాడిన‌ట్ట‌య్యింది. కంటెంట్ పరంగా ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ది సంక్రాంతిలో టాప్ జాబితా. అయితే, స‌రైన ప్ర‌మోష‌న్ లేక వ‌సూళ్ల‌లో ఈ సినిమా కాస్త వెనుక‌ప‌డిఉంది. ‘ఎఫ్-2’ మాత్రం టిక్కెట్లు దొర‌క‌ని ప‌రిస్థితి ఉంది. కామెడీ వేగానికి మారు పేరు అయిన అనిల్ రావిపూడి పెళ్లాల కామెడీతో థియేట‌ర్ల‌ను న‌వ్వుల పాలు చేశారు. అన్న సినిమాకు ఆనంద భాష్పాలు రాలితే… ఎఫ్‌2కి పొట్ట‌చెక్క‌లై క‌న్నీళ్లు న‌వ్వ‌లేక‌ కారుతున్నాయి.

Check out MS DHONI Signed Bat CLICK HERE

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article