మ‌ర‌ణించింది న‌లుగురే..

80
Center has revealed that only four people have died of black fungus in Telangana,Four people died of black fungus in telangana
Center has revealed that only four people have died of black fungus in Telangana,Four people died of black fungus in telangana

తెలంగాణలో బ్లాక్‌ ఫంగస్‌తో చనిపోయింది నలుగురు మాత్రమేనని కేంద్రం వెల్లడించింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ పవార్ రాజ్యసభలో నిన్న బ్లాక్ ఫంగస్‌పై ఓ సభ్యుడు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. బ్లాక్ ఫంగస్‌తో దేశవ్యాప్తంగా 4,332 మంది మరణించారని తెలిపారు. తెలంగాణలో 2,538 మంది ఈ ఫంగస్ బారినపడగా నలుగురు మాత్రమే చనిపోయినట్టు వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here