ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు ఉచిత శిక్షణ

ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న నిరుద్యోగ యువతకు రాష్ట్రంలో ని 11 స్టడీ సర్కిల్స్ లో శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయని బిసి స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ బాలాచారి నామోజు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్లాసుల నిర్వహణ జరుగుతోందన్నారు. అభ్యర్థులు చాలా ఉత్సాహంగా హాజరు అవుతున్నారని తెలిపారు. ఇంకా ఎవరైనా నమోదు చేసుకోవలనుకుంటే వారి పరిధిలోని స్టడీ సర్కిల్లో సంప్రదించి అడ్మిషన్ పొందవచ్చని సూచించారు. ఆన్ లైన్ క్లాసులూ కొనసాగుతాయని తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article