వలస కార్మికులకు టీకాఉచితం

Telangana Government Decided To Give Free Vaccine To Migrants, Good Decision By CM KCR.

511
free vaccine to migrants in telangana
free vaccine to migrants in telangana

రాష్ట్ర ప్రజలతో పాటుగా ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన కార్మికులు, ఉద్యోగులకు కూడా ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీంతో రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం మానవీయతకు నిదర్శనమని అభినందించారు. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో చిక్కుకున్న వలస కార్మికుల కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేసి తన పెద్ద మనస్సు చాటుకున్నారని కొనియాడారు. ఆయన నిర్ణయం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here