03-02-2019 నుండి 09-09-2019 వరకు వారఫలాలు

From 03-02-2019 to 09-09-2019 weekly Horoscope

మేషరాశి :ఈవారం నూతన ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు, కొన్ని కొన్ని విషయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకొనే అవాశం ఉంది. బంధువులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడే అవకాశం కలదు. మిత్రులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. కోపం పెరుగుటకు ఆస్కారం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు పెద్దగా కలిసి రాకపోయినా, ఇప్పటికే చేస్తున్న ఉద్యోగంలో గౌరవము పెరుగుతుంది. విలువైన వస్తువులను కొనుగులు చేయుటకు ఆస్కారం కలదు. భాగస్వామ్య ఒప్పందాలు ముందుకు సాగుతాయి. చర్చల్లో కాస్త నిదానం అవసరం.

 
వృషభరాశి :ఈవారం ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం సూచన. గతంలో చేపట్టిన పనుల వలన మంచి గుర్తింపును పొందుతారు. భాగస్వామి తో విభేదాలు పెరుగుటకు ఆస్కారం ఉంది. చిన్న చిన్న విషయాలను సైతం అశ్రద్ధ చేయకండి. నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన లబ్దిని పొందుతారు. చర్చాపరమైన విషయాల్లో సమయాం గడుపుతారు. దూరప్రదేశం ప్రయాణం చేసే విషయంలో స్పష్టత వస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. నూతన పరిచయాలు మీకు లబ్దిని కలుగజేస్తాయి. వాహనాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. సర్దుబాటు విధానం మంచిది. 
 
మిథునరాశి:ఈవారం దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. చేపట్టిన పనులను పూర్తిచేయుటలో కాస్త ఇబబందులు తప్పక పోవచ్చును. మిత్రులనుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది, అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆరంభంలో కాస్త నిదానంగా ఉండుట సూచన. రుణపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం. మిత్రులను కలుస్తారు.  
కర్కాటకరాశి :ఈవారం వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. నూతన పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుట మంచిది. బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి, వాటి విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. వాహనాలను కొనుగులు చేయుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బదిలీ అయ్యే ఆస్కారం ఉంది. 
 
సింహరాశి :ఈవారం మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడుతాయి. పెద్దలతో మీకున్న పరిచయం బలపడుతుంది. వాహనాల వలన లేదా అగ్ని పరమైన విషయాల వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి, నలుగురిని కలుపుకొని వెళ్ళండి. 
 
కన్యారాశి : ఈవారం సోదరుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి, అనుకోకుండా చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా పూర్తిచేసే ఆస్కారం ఉంది. సంతానం విషయంలో సంతృప్తిని కలిగి ఉంటారు. రుణపరమైన విషయాలలో నూతన అవకాశాలు పొందుతారు. వ్యాపారపరమైన విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చర్చాప్రమైన విషయాల్లో సమయం గడుపుతారు. విదేశీప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగప్రయత్నాలు ముందుకు సాగుతాయి. మీ మాటతీరు కొంతమందికి నచ్చక పోవచ్చును. అందరిని కలుపుకొని వెళ్ళుట సూచన. 
 
తులారాశి:ఈవారం తోటివారితో సర్దుకుపోకపోతే నూతన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త. కుటుంభసభ్యుల నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. భాగస్వామి తో విరోధాలు మరింతగా పెరుగుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. దైవసంభందమైన విషయాలకు సమయం ఇస్తారు. చిననాటి మిత్రులతో కలిసి సమయాన్ని విందులకు ఇస్తారు వాటిలో పాల్గొంటారు ఆరోగ్యం విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి. విదేశీప్రయాణాలు కలిసి వస్తాయి ప్రయత్నం చేయండి. చిననాటి మిత్రులను కలిసే అవకాశం ఉంది.     
 
వృశ్చికరాశి :ఈవారం కొన్ని కొన్ని విషయాల్లో మీయొక్క మాటతీరు మీ అనుకొనే వాళ్ళను ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది, సర్దుబాటు మంచిది. ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి కాకపోతే బద్దకాన్ని వదిలి ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట సూచన. విలువైనవాటిని కొనుగోలుచేసుకొనే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. మానసికంగా అధికంగా ఊహించుకోవడం వలన కొంత ఇబ్బందులను పొందుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పెట్టుబడుల విషయంలో మాత్రం తొందరపాటు వద్దు, నిదానం అవసరం.
 
ధనస్సురాశి:ఈవారం మొత్తంమీద వ్యాపారపరమైన విషయాల్లో ఆశించిన మార్పులకు ఆస్కారం కలదు, పెద్దలను కలుసుతారు. నూతన పెట్టుబడులకు సంబంధించి పనులు వేగంగా ముందుకు కదులుతాయి. స్త్రీ / పురుషుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. మిత్రులతో కలిసి నూతన పనులను చేపట్టి అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. దూరప్రదేశం నుండి ఒక వార్తను వినే అవకాశం ఉంది. బంధువులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళుటకు అవకాశం ఉంది. మీయొక్క మాటతీరును సరిదిద్దుకోకపోతే మాత్రం వివాదాలు ఏర్పడే అవకాశం కలదు. నూతన పరిచయాలు అయ్యే ఆస్కారం కలదు.  
మకరరాశి :ఈవారం అధికారులతో నూతన పనులను ఆరంభించే విషయంలో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. రాజకీయరంగాలలో ఉన్నవారికి నూతన అవకాశాలు అలాగే పరిచయాలు కలుగుతాయి. చిననాటి మిత్రులు లేదా మీ శ్రేయోభిలాషుల నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. కొత్త కొత్త ప్రయోగాలు చేయకండి ముందుగా ఉన్నవాటికి ప్రాధాన్యం ఇవ్వడం సూచన. వ్యాపారపరమైన విషయాల్లో బద్ధకం వీడండి. సర్దుబాటు విధానం కొన్ని కొన్ని విషయాల్లో అవసరం అని గుర్తిస్తారు. విదేశీప్రయాణ అవకాశాలు మెరుగుపడుతాయి. ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని గడిపే అవకాశం ఉంది.
 
కుంభరాశి :ఈవారం ఉద్యోగంలో అధికారుల నుండి సహకారం పొందుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుట వలన నలుగురిలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. కుటుంభంలో సంతానం విషయంలో మార్పులు కలుగుటకు ఆస్కారం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయాలు మరింత బలపడే అవకాశం ఉంది. దూరప్రదేశం నుండి విలువైన సమాచారం పొందుతారు అలాగే ప్రయాణాలు అనుకూలిస్తాయి. శారీరకశ్రమను కలిగి ఉంటారు ముఖ్యంగా భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉండుట సూచన. మార్పులను స్వాగతించుట వలన నూతన ఆలోచనలకు శ్రీకారం చుట్టే అవకాశం లభిస్తుంది.
 
మీనరాశి :ఈవారం వాహనాలను కొనుగోలు చేయుటకు అవకాశం కలదు. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి. నూతన ప్రయత్నాలు ఇతరులతో కలిసి పనిచేసే విషయంలో సర్దుబాటు విధానం వలన లబ్దిని పొందుతారు. బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. స్వల్పప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. సంప్రదాయ పనులలో బాగా రాణిస్తారు కావున ఈ విషయంలో సరైన ప్రయత్నాలు చేయుట మంచిది. సోదరసంబంధమైన విషయాల్లో వారితో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. సంతానం మూలాన సంతోషాన్ని పొందుతారు వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం కలదు.
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article