Fruits @ Phone Call
కరోనా వైరస్ ప్రబలకుండా లాక్ డౌన్ నేపథ్యంలో రైతులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటి వద్దకే పండ్ల సరఫరా కార్యక్రమం జరుగుతున్నది. దీంతో మార్కెటింగ్ శాఖ ప్రయత్నానికి ఆదరణ పెరుగుతున్నది. జంటనగారాలలో కాలనీలు, అపార్ట్ మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు 30 ప్యాక్ లు ఆర్డర్ ఇస్తే నేరుగా సరఫరా చేస్తారు.
- రూ.300 లకు మామిడి 1.5 కేజీ, బొప్పాయి 3 కిలోలు, సపోట 1 కేజీ, బత్తాయి 2.5 కేజీలు, 12 నిమ్మకాయల ప్యాక్, 4 కిలోల కలంగిరి. 30 టన్నుల బత్తాయి, 10 టన్నుల మామిడి, 6 టన్నుల సపోట, 8 టన్నుల కలంగిరి (వాటర్ మిలన్), 2 టన్నుల నిమ్మ , 10 టన్నుల బొప్పాయి సరఫరా. 7330733212 కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తే ఇంటివద్దకే నాణ్యమైన పండ్లు అందజేస్తారు. ఉద్యాన పంటల రైతులను ఆదుకునేందుకు సత్పలితాలిస్తున్న ప్రయోగం.
- వ్యవసాయ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, రవికుమార్ , జేడీ శ్రీనివాస్, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ నర్సింహారెడ్డిల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పంపిణీ.
– ప్రజలు బయటకు రాక స్థానికంగా అమ్ముకునేందుకు రైతులకు ఇబ్బందులు
– ఇప్పటికే మొబైల్ రైతుబజార్ల ద్వారా రోజుకు 550 కేంద్రాలలో ప్రజల వద్దకు పండ్లు, కూరగాయలు
– వారానికి జంటనగరాలలోని 3500 పై చిలుకు ప్రాంతాలకు సరఫరా
– పండ్ల సరఫరాకు ప్రత్యేక కార్యాచరణతో రైతులకు ఉపశమనం
– పండ్లను వ్యవసాయ క్షేత్రాల వద్ద రైతుల వద్ద నుండి నేరుగా సేకరిస్తున్న వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ
– వీలయినన్ని ఎక్కువ మొత్తంలో పండ్ల సరఫరాకు శక్తివంచన లేకుండా కృషిచేయాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశం.