యాదాద్రి వైన్ షాపుల‌కు ఫుల్ గిరాకీ

యాదాద్రి భువనగిరి జిల్లా లో 82 వైన్ షాప్ లో గాను 1379 టెండర్లను వేశారు. ఎక్సైజ్ శాఖకు టెండర్ల ద్వారా 27 కోట్ల 58 లక్షల రూపాయలు ఆదాయం సమకూరింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 82 షాపులు ఉండగా యాదాద్రి భువనగిరి జిల్లా లోని భువనగిరి ఆలేరు రామన్నపేట మోత్కూరు స్టేషన్లు ఉన్నాయి. అందులో భువనగిరి ఎస్ ఎచ్ఓ లో కింద 424 ఆలేరు లో 326, రామన్నపేట 361, మోత్కూరు 268 టెండర్లు వేశారు. ఎస్టీలు 15 ఎస్సీలు, 112, గౌడ్స్ 322, ఓపెన్ కేటగిరి 930 షాపులు టెండర్లు వేశారు. అతి తక్కువ గా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో 9 టెండర్లు, చాడ ముత్తిరెడ్డిగూడెం 9 టెండర్లు అత్యధికంగా చౌటుప్పల్ మండలం ఎల్లం బావి షాపు 48 టెండర్లు వేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article