నాకు ఉద్యోగం ఇవ్వండని గద్దర్ దరఖాస్తు

Gaddar applies for Govt job

ప్రజాయుద్ధ నౌక గద్దర్ తనకు ఉద్యోగం కావాలంటూ తెలంగాణ సాంస్కృతిక సారథి కి దరఖాస్తు చేసుకోవడం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నో వేల మందిని చైతన్యవంతం చేసిన గళం  ఆయనది. ఎన్నో వేల మందిని ఉత్సాహంతో ఉరకలు వేసేలా చేసిన ఘనత  ఒక  గద్దర్ కే సొంతం.  అలాంటి  ప్రజా యుద్ధనౌక గద్దర్ తనకు ఉద్యోగం కావాలి అంటున్నాడు. నేను కళాకారుణ్ని.. పాటలు పాడుతా.. నాకో ఉద్యోగమివ్వండి.. అంటూ తెలంగాణ సాంస్కృతిక సారథికి ఆయన దరఖాస్తు  చేసుకున్నారు. తనకు ఇప్పుడు 73 ఏళ్లు.. ప్రస్తుతానికి ఎలాంటి సర్టిఫికెట్లు తన దగ్గర లేవు.. తనకు ఉద్యోగం ఇవ్వాలని విన్నవించుకున్నారు. సాంస్కృతిక సారథి నియామక కమిటీ సభ్యుడు శివ కుమార్‌ను కలిసి ప్రముఖ గాయకుడు గద్దర్ దరఖాస్తును అందజేశారు.

దీనిపై స్పందించిన గద్దర్.. ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నది నిజమే కళాకారుడిగా టెంపరరీ ఉద్యోగం అడిగానని తెలిపారు. దాదాపు 5 వేల మంది కళాకారులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో నేనొక్కడిని. దరఖాస్తు చేసుకోవటంలో తప్పేముంది? నా వృత్తి పాడటమే. నాకు పాడటం వచ్చు. నేను బతకాలి కదా.. అందుకే దరఖాస్తు పెట్టుకున్నట్టు గద్దర్ తెలిపారు. అంతేకాదు.. తాను ఉద్యోగమే అడిగాను.. లీడర్‌షిప్ ఏమీ అడగలేదన్నారు గద్దర్.. కళాకారులతో కలిసి రోజుకు ఎనిమిది గంటలు  తిరుగుతానని గద్దర్ పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, మూడెకరాల భూమి ఆ స్కిట్లు నేను కూడా చేస్తానని చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఉద్యమాల్లో పాలుపంచుకున్న గద్దర్.. తెలంగాణ ఉద్యమంలోనూ ప్రముఖ పాత్ర పోషించారు.. ఇప్పుడు ఆయన ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం  ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది.  గత ఎన్నికల్లో  సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎన్నికల బరిలోకి దిగుతానని చెప్పిన గద్దర్ ఇప్పుడు,  తెలంగాణ ప్రభుత్వంలో కొలువు కోరడం అందరినీ షాక్ కు  గురి చేస్తుంది.

Gaddar applies for Govt job,Singer Gaddar Job Application for Telangana Govt, praja yuddha nouka , telangana samskruthika saradhi, job, application

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *