కిషన్ రెడ్డితో గల్లా జయదేవ్, భూమా అఖిల ప్రియ భేటీ 

131
GALLA JAYADEV AND AKHILA PRIYA MET KISHAN REDDY
GALLA JAYADEV AND AKHILA PRIYA MET KISHAN REDDY
GALLA JAYADEV AND AKHILA PRIYA MET KISHAN REDDY

ఏపీ లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భేటీ అయ్యారు. ఏపీలో టీడీపీ నేతల మీద పెరిగిపోయిన దాడులు, పెడుతున్న అక్రమ కేసులపై హైదరాబాద్‌లోని కిషన్ నివాసంలో శనివారం మధ్యాహ్నం ఈ భేటీ జరిగింది. సుమారు అరగంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో తాజా పరిణామాలు.. ముఖ్యంగా దివంగత నేత కోడెల శివప్రసాద్‌పై పెట్టిన కేసుల విషయాలను కేంద్ర మంత్రి దృష్టికి గల్లా తీసుకెళ్లారు.మరోవైపు.. కర్నూలులో రాజకీయ దాడులు చేస్తున్నారని కేంద్రమంత్రికి అఖిల ప్రియ ఫిర్యాదు చేశారు. ఫ్యాక్షన్ గ్రామాల్లో పరిస్థితులను చక్కదిద్దేలా ఆదేశాలు ఇవ్వాలని మాజీ మంత్రి కోరారు. గల్లా, అఖిల ప్రియ ఫిర్యాదులు స్వీకరించిన కేంద్ర మంత్రి కిషన్.. సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఈ విషయాలపై లోతుగా చర్చించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలుస్తోంది. భూమా అఖిల ప్రియ టీడీపీకి టాటా చెప్పి బీజేపీ లేదా సొంతగూడైన వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని ఏపీ ఎన్నికల ఫలితాల అనంతరం పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే భూమా కుటుంబానికి చెందిన పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే తాజాగా అఖిల.. కేంద్ర మంత్రితో భేటీ కావడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది .

Tags :  union minister , kishan reddy, galla jayadev , bhooma akhila priya , ap , attacks , illegal cases, kodela suicide

 హుజూర్ నగర్ టిఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి

టీడీపీకి మరో దెబ్బ .

ఇదేనా.. మెట్రో ట్రైనులో ప్రయాణీకుల భద్రత?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here